Sauna Bath : వినేశ్ ఫొగాట్, అమన్ సెహ్రావత్ సౌనా బాత్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? దీనివల్ల నిజంగా బరువు తగ్గుతారా?

సౌనా బాత్ ను చాలామంది రిలాక్స్ కోసం అనుసరిస్తారు. దీనివల్ల సులువుగా శరీరం నుంచి బరువును కోల్పోవచ్చు. అయితే ఇది తాత్కాలిక పద్ధతి మాత్రమే. ఈ పద్ధతి ద్వారా బరువు తగ్గినప్పటికీ.. మళ్లీ త్వరగానే బరువు పెరిగే అవకాశం ఉంది. రక్త సరఫరాను మెరుగుపరచడం, కండరాల పై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో ఈ విధానం ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : ఆగస్ట్ 14, 2024 3:02 సా.

Sauna Bath

Follow us on

Sauna Bath : ఒలింపిక్స్ లో మిగతా క్రీడల సంగతి ఎలా ఉన్నా.. మల్ల యుద్ధంలో మాత్రం కచ్చితంగా అథ్లెట్లు నిర్దేశించిన బరువు మాత్రమే ఉండాలి. వారు ఆడే విభాగానికి సంబంధించిన బరువు ఏమాత్రం దాటొద్దు. ఒకవేళ బరువు ఒక్క గ్రాము ఎక్కువగా ఉన్నా తదుపరి పోటీలకు వారు అనర్హులు. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో.. ఆమెపై అనర్హత వేటు విధించారు. అయితే ఈ బరువు తగ్గడానికి వినేశ్ ఫొగాట్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందులో భాగంగా ఆమె సౌనాస్ బాత్ ను ఆశ్రయించింది.. వేగంగా బరువు తగ్గినప్పటికీ.. చివరికి 100 గ్రాముల బరువును ఆమె తగ్గించుకోలేకపోయింది. దీంతో ఆమె ఫైనల్ పోటీలకు అనర్హత వేటు ఎదుర్కొంది. నిజానికి సౌనాస్ బాత్ వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒలింపిక్స్ పోటీలలో మల్ల యుద్ధంలో పాల్గొన్న అమన్ 61.5 కేజీల బరువు ఉన్నాడు. అతడు తదుపరి పోటీలలో పాల్గొనాలంటే 4.5 కిలోలు తగ్గిపోవాలి. అది కూడా కేవలం 10 గంటల్లోనే. అలా తగ్గితేనే అతడు 57 కిలోల సెమీఫైనల్ లో తలపడగలడు. దీంతో ఒక గంట పాటు వేడి నీటి లో స్నానం చేసి బరువు తగ్గాలని భావించాడు. అయితే అది సత్ఫలితాలను ఇచ్చింది. ఫలితంగా అతడు సెమీ ఫైనల్ లో తలపడ్డాడు.

సౌనా బాత్ అంటే..

సౌనా బాత్ ను ఆవిరి స్నానం అని అనవచ్చు. దీనివల్ల ఎక్కువగా చెమట పడుతుంది. స్నానం చేసే గది కూడా వేడిగా ఉంటుంది. బాయిలర్ల ద్వారా ఉత్పత్తయ్యే వేడి తేమ ను గదిలోకి పంపిస్తారు. దీనివల్ల ఇందులో ఉష్ణోగ్రత బయటి వాతావరణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్నానం చేసేటప్పుడు కాటన్ టవల్, షార్ట్ ను ఆటగాళ్లు ధరిస్తారు. దీనివల్ల శరీరం మొత్తానికి వేడి గాలి తగలడం వల్ల ఊరికనే చెమట పడుతుంది. ఫలితంగా శరీరం వేగంగా కేలరీలను కోల్పోతుంది.

రిలాక్స్ కోసం..

సౌనా బాత్ ను చాలామంది రిలాక్స్ కోసం అనుసరిస్తారు. దీనివల్ల సులువుగా శరీరం నుంచి బరువును కోల్పోవచ్చు. అయితే ఇది తాత్కాలిక పద్ధతి మాత్రమే. ఈ పద్ధతి ద్వారా బరువు తగ్గినప్పటికీ.. మళ్లీ త్వరగానే బరువు పెరిగే అవకాశం ఉంది. రక్త సరఫరాను మెరుగుపరచడం, కండరాల పై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో ఈ విధానం ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అయితే దీనివల్ల కొవ్వు కరగదు. శరీరంలో ఉన్న నీరు త్వరగా బయటికి పోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. అయితే ఇదే రీతిన చెమట ని కోల్పోతే శరీరం నిస్సత్తువకు గురయ్యే ప్రమాదం ఉంది.

చర్మం కాంతివంతంగా మారుతుంది

సౌనా బాత్ వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. మృత కణాలు కూడా నీటి ద్వారా బయటికి వెళ్తాయి. ఇలాంటి స్నానం వల్ల శిరోజాలు, ఉదర భాగంలో ఉన్న కండరాల పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా అంతర్గత నొప్పులు, కీళ్లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అందువల్లే చాలామంది క్రీడాకారులు సౌనా బాత్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. శీతల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులు సౌనా బాత్ చేసేందుకు ఇష్టాన్ని చేపిస్తారు. కొంతమంది క్రీడాకారులు ఇందులో వనమూలికలు వేసుకొని ఆవిరి స్నానం చేస్తారు. దీనివల్ల వారి శరీరం మరింత ఉత్తేజితమవుతుంది. వివిధ రోగాల నుంచి రక్షణ పొందుతుంది.