Devara Chuttamalle Song: ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘దేవర’. సుమారుగా ఆరేళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి విడుదలవుతున్న సోలో చిత్రమిది. #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ కలిసి చేస్తున్న చిత్రం అయ్యినప్పటికీ, ఆచార్య ప్రభావం ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కారణంగా ‘దేవర’ పై ఏమాత్రం కూడా పడకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ప్రతీ కంటెంట్ కి అభిమానుల నుండి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వస్తుంది. ముందుగా గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యగా, అక్కడి నుండి ఈ చిత్రం మీద అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో, అలా చూపించి వాళ్ళ ఆకలి ని తీర్చే ప్రయత్నం చేసాడు కొరటాల శివ. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ సినిమా నుండి విడుదలైన ‘ఫియర్ సాంగ్’ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఈ చిత్రం పై అంచనాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పడ్డాయి. ఇక రీసెంట్ గా విడుదలైన డ్యూయెట్ సాంగ్ ‘చుట్టమల్లే’ పాట ఇప్పటి వరకు విడుదలైన ‘దేవర’ కంటెంట్స్ అన్నిటికంటే సునామీ లాంటి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 8 రోజుల్లోనే ఈ పాటకి యూట్యూబ్ లో 60 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాట ఊపు చూస్తూ ఉంటే పుష్ప నుండి చార్ట్ బస్టర్ సాంగ్ గా నిల్చిన ‘చూసేకి’ అనే పాటకి వచ్చిన వ్యూస్ ని మరో వారం రోజుల్లో దాటేస్తుందని అందరూ అంటున్నారు. పుష్ప నుండి విడుదలైన ఆ పాటకి రెండు నెలల్లో 120 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ ‘చుట్టమల్లే’ పాటకి కేవలం 8 రోజుల్లోనే 60 మిలియన్ వ్యూస్ రావడం, ఇంస్టాగ్రామ్ లో ఈ పాట మీద రీల్స్ చేసే నెటిజెన్స్ రోజురోజుకి పెరుగుతూ పోవడం ని చూస్తుంటే ఫుల్ రన్ లో ‘చూసేకి’ పాటని డబుల్ మార్జిన్ వ్యూస్ తో రికార్డు ని బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.
ఇది ఇలా ఉండగా ఆగస్టు 16 వ తారీఖున ఈ సినిమా విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయనకీ సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నిన్నటితో దేవర చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందట. త్వరలోనే ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్న ఆయుధ పూజ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకంటే పెద్ద హిట్ అవుతుందని, థియేటర్స్ లో ఈ పాట ఫ్యాన్స్ కి పూనకాలు రప్పిస్తుందని మేకర్స్ అంటున్నారు.