Victory Parade Stampede : ఈ మహా విషాదంలో ఏకంగా 10కి మించి అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 ఏళ్ల టీనేజ్ బాలుడు ఉండడం మరింత విషాదం.. అయితే ఆ బాలుడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని అని తెలుస్తోంది.. విరాట్ కోహ్లీని నేరుగా చూసేందుకు అతడు ఏకంగా కర్ణాటక కు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నడ సీమకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే జరిగిన మహా విషాదంలో అతడు అసువులు బాసినట్టు తెలుస్తోంది..
Also Read : ఇండియా నే ఫాలో అయిన ఇంగ్లీష్ జట్టు.. మొత్తంగా టెస్ట్ సిరీస్ రసవత్తరం!
మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో బెంగళూరులోని దేవరాజ్ అనే వ్యక్తి కుమారుడు మనోజ్ కుమార్ ప్రాణాలు విడిచాడు. మనోజ్ కుమార్ వయసు 20 సంవత్సరాలు. దేవరాజు కర్ణాటక రాజధానిలో పానీపూరి అమ్ముకుంటాడు. తన కుమారుడిని స్థానికంగా ఉన్న కాలేజీలో చదివిస్తున్నాడు. ఎదిగిన కొడుకు చేతికి అంది వచ్చాడని.. తనకు భరోసాగా ఉంటాడని దేవరాజ్ భావించాడు. అతనిపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు..దేవరాజ్ ఒక విధంగా అనుకుంటే.. బుధవారం మరొకటి జరిగింది. ఇంతటి మహావిషాదంలో దేవరాజ్ కుమారుడు మనోజ్ కన్నుమూశాడు. తొక్కిసలాట సంబంధించిన వార్తలను దేవరాజ్ టీవీలో చూస్తున్నాడు. తన కుమారుడు విజయయాత్ర వద్దకు వెళ్లిన నేపథ్యంలో అతడికి ఫోన్ చేశాడు . అతని ఫోన్ వేరే వ్యక్తి ఎత్తడంతో దేవరాజ్ కు అనుమానం వచ్చింది.. ఆ తర్వాత అధికారులు దేవరాజ్ తో మాట్లాడారు..” మీరు అర్జెంటుగా హాస్పిటల్ రండి.. మీ అబ్బాయి పరిస్థితి బాగోలేదు” అని చెప్పగానే దేవరాజ్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది.. దీంతో అతడు హాస్పిటల్ వెళ్ళగానే మనోజ్ విగత జీవిగా కనిపించాడు.. ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
” ఇంతటి విషాదం చోటు చేసుకుంది. నా కొడుకు ప్రాణం పోయింది. నాకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాదు. కన్నడ జట్టు ఇచ్చే పరిహారం కూడా కాదు.. నేను 50 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు ఇస్తాను. నా కొడుకు ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా. బోరింగ్ ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉన్న అతడిని సజీవుడిగా తీసుకు రాగలరా” అంటూ దేవరాజ్ ప్రశ్నించాడు..” నా కుమారుడిని దూరం చేశారు. ఇంతటి దారుణం ఏ తండ్రికి రాకూడదు.. ఇంతటి కష్టం ఏ తండ్రి చవి చూడకూడదు. 20 ఏళ్ల కొడుకు చనిపోతే ఎంతటి బాధ ఉంటుంది? ఎంతటి ఇబ్బంది ఉంటుంది? ఇలాంటి దుస్థితి ఎందుకు నేను చవిచూడాలి? నేను ఏం పాపం చేశాను? నా కొడుకు లేకుండా నేను ఎలా ఉండాలి. ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి.. నా భార్యను నేను ఎలా ఓదార్చాలి” అంటూ దేవరాజ్ కన్నీటి పర్యంతమవుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.