India vs England Test series : గంభీర్ శిక్షకుడిగా వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. పైగా జట్టు ప్రకటన విషయంలో ముందుగానే బిసిసిఐ రెస్పాండ్ అవుతోంది. గతంలో మాదిరిగా వ్యవహరించడం లేదు. యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తోంది. ఈ నెలలో ఇంగ్లీష్ జట్టుతో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ కు కూడా యంగ్ ప్లేయర్లను సెలెక్ట్ చేసింది. టీమిండియాలో జడేజా, బుమ్రా మినహా మిగతా వారంతా యంగ్ ప్లేయర్లు కావడం విశేషం.. పైగా డబ్ల్యూటీసీ సైకిల్ లో టీమిండియా ఆడే అతిపెద్ద సుదీర్ఘ ఫార్మాట్ కూడా ఇదే. అయితే దీనిని ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు కూడా ఫాలో అయింది.
Also Read : గంభీర్ చూస్తున్నావా.. కేకేఆర్ ను గెలిపించింది అయ్యర్.. క్రెడిట్ కొట్టేశావ్ గా..
గిల్ సేనతో తలపడే ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లీష్ టీం తన బృందాన్ని ప్రకటించింది. ఇంగ్లీష్ జట్టుకు స్టోక్స్ నాయకత్వం వహిస్తాడు.. అయితే ఇంగ్లీష్ జట్టు మేనేజ్మెంట్ కూడా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది.. కుక్, స్టోక్స్ మినహా మిగతా వారంతా యంగ్ ప్లేయర్లు కావడం విశేషం. మొత్తం 14 మందితో ఇంగ్లీష్ మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది. వీరిలో , జాకబ్ బెతల్, డకెట్, పోప్, కార్స్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు.. ఇక భీభత్సంగా బ్యాటింగ్ చేయడానికి బ్రూక్ రెడీ గానే ఉన్నాడు. గతంలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో వీరు అదరగొట్టారు.. అంతకుముందు జరిగిన సిరీస్ లలోను దుమ్మురేపారు. భీకరంగా బ్యాటింగ్ చేశారు. మైదానంలో పరుగుల వరద పారించారు. తమ జట్టుకు వరుస విజయాలు అందించారు. ఐతే ఇదే జోరును వారు కొనసాగించినప్పటికీ.. తదుపరి మ్యాచ్లలో ఇంగ్లీష్ జట్టు గెలుపును అందుకోలేకపోయింది. గత ఏడాది మనదేశంలో పర్యటించినప్పుడు ఇంగ్లీష్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ ను దారుణంగా ఓడిపోయింది.. అయితే ఈసారి ఇంగ్లీష్ జట్టు ఎలా ఆడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో టెస్ట్ క్రికెట్ లో బజ్ బాల్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ జట్టు.. స్వదేశంలో జరిగే సిరీస్లో అదే విధానాన్ని కొనసాగిస్తుందని తెలుస్తోంది. బజ్ బాల్ విధానంలో ఇంగ్లీష్ జట్టుకు కొన్ని విజయాలు.. కొన్ని వైఫల్యాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఇంగ్లీష్ జట్టు ఆ విధానాన్ని మానుకోవడం లేదు. పైగా వేగవంతమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తోంది.. అటు ఇండియాలో కూడా యంగ్ ప్లేయర్లు ఉండడంతో.. రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుందని తెలుస్తోంది. మరోవైపు 2007 తర్వాత భారత జట్టు ఇంగ్లీష్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసుకోలేదు.
ఇంగ్లీష్ జట్టు వివరాలు ఇవే
స్టోక్స్(కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెతల్, బ్రూక్, కార్స్, కుక్, క్రాలే, డకెట్, ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జెమిస్మిత్, జోష్ టాంగ్, వోక్స్.