మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది!

సాధారణంగా రిటైర్ అయ్యాక అందరూ సొంతూళ్ల వెళ్లి పెన్షన్ డబ్బులతో లేదా.. సంపాదించిన డబ్బులతో కొన్ని ఎకరాల పొలం కొని ప్రకృతి సేద్యం చేస్తూ ప్రకృతితో మమేకం అవుతూ పంటలు పండిస్తారు. అయితే గ్రామాల నుంచి వచ్చిన వారు ఇలా చేస్తారు. మన దిగ్గజ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సైతం ఇదే ఒరవడిని ఎంచుకోవడం విశేషంగా చెప్ప వచ్చు. Also Read: కొత్తరకం కరోనా గురించి షాకింగ్ న్యూస్.. ఏ వ్యాక్సిన్ పని చేయదట..? అంతర్జాతీయ […]

Written By: NARESH, Updated On : January 5, 2021 11:34 am
Follow us on

సాధారణంగా రిటైర్ అయ్యాక అందరూ సొంతూళ్ల వెళ్లి పెన్షన్ డబ్బులతో లేదా.. సంపాదించిన డబ్బులతో కొన్ని ఎకరాల పొలం కొని ప్రకృతి సేద్యం చేస్తూ ప్రకృతితో మమేకం అవుతూ పంటలు పండిస్తారు. అయితే గ్రామాల నుంచి వచ్చిన వారు ఇలా చేస్తారు. మన దిగ్గజ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సైతం ఇదే ఒరవడిని ఎంచుకోవడం విశేషంగా చెప్ప వచ్చు.

Also Read: కొత్తరకం కరోనా గురించి షాకింగ్ న్యూస్.. ఏ వ్యాక్సిన్ పని చేయదట..?

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోని ఇప్పుడు తన భావి జీవితాన్ని ప్రకృతితో గడిపేస్తున్నాడు. తన స్వస్థలం రాంచీలోని సెంబో గ్రామంలో భారీగా భూములు కొని వ్యవసాయ క్షేత్రాన్ని ధోని ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే కూరగాయలు, వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. గత ఏడాది 2వేల కడక్ నాథ్ కోళ్లతో పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేశాడు.

తాజాగా తన ఫాంహౌస్ లో ధోని కూరగాయలు పండిస్తున్నాడు. ఖరీదైన స్ట్రాబెర్రీ, క్యాబేజీ, టమాట సహా ఇతర కూరగాయాలను పురుగుల మందులు వాడకుండా పండించి దుబాయ్ కి ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం ఫాంఫ్రెష్ అనే ఏజెన్సీని ఎంపిక చేసినట్టు సమాచారం.

Also Read: ‘భారత్’లో విజృంభిస్తున్న మరో వ్యాధి.. 12వేల బాతులు మృతి..?

ధోని కూరగాయల ఎగుమతుల బాధ్యతలను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుందని.. ఎగుమతులపై చర్చలు తుదిదశలో ఉన్నాయని మీడియా వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ధోని కూరగాయలకు రాంచీ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉందంట.. ఇప్పుడు అంతర్జాతీయంగా ధోని కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్