https://oktelugu.com/

క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వివరాలు లీక్..?

క్రెడిట్, డెబిట్ కార్డులను వాడేవాళ్లకు భారీ షాక్ తగిలింది. డార్క్ వెబ్ లో ఏకంగా 10 కోట్ల మంది వాడుతున్న క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ప్రత్యక్షమయ్యాయి. డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైన వివరాల్లో పేర్లు, ఈమెయిల్ ఐడీ, అడ్రస్, కార్డు మొదటి, చివరి నాలుగు నంబర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఒక సెక్యూరిటీ రీసెర్చర్ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు లావాదేవీలు జరిపే ఫ్లాట్ ఫామ్ సంస్థ ద్వారా ఈ వివరాలు లీక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 4, 2021 / 09:38 PM IST
    Follow us on

    క్రెడిట్, డెబిట్ కార్డులను వాడేవాళ్లకు భారీ షాక్ తగిలింది. డార్క్ వెబ్ లో ఏకంగా 10 కోట్ల మంది వాడుతున్న క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ప్రత్యక్షమయ్యాయి. డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైన వివరాల్లో పేర్లు, ఈమెయిల్ ఐడీ, అడ్రస్, కార్డు మొదటి, చివరి నాలుగు నంబర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఒక సెక్యూరిటీ రీసెర్చర్ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు లావాదేవీలు జరిపే ఫ్లాట్ ఫామ్ సంస్థ ద్వారా ఈ వివరాలు లీక్ అయినట్టు తెలుస్తోంది.

    Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలంటే..?

    2017 సంవత్సరం మార్చి నెల నుంచి 2020 సంవత్సరం ఆగష్టు నెల వరకు జరిపిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయని.. లీకైన వివరాల్లో మన దేశానికి చెందిన వారి డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని సమాచారం. జస్ పే పేరుతో డార్క్ వెబ్ లో ఈ వివరాలు అందుబాటులో ఉండగా ఈ వివరాలు ఎవరు పెట్టారో వారికి ఈ వివరాలు ఎలా తెలిశాయో తెలియాల్సి ఉంది.

    Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు షాక్.. కేంద్రం కొత్త ఈకామర్స్ వెబ్ సైట్…!

    లీకైన వివరాలను బిట్ కాయిన్ ద్వారా కొనాలని హ్యాకర్ చెబుతున్నారని సమాచారం. హ్యాకర్ కొనుగోలుదారులను టెలీగ్రామ్ ద్వారా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. జస్‌పై వ్యవస్థాపకుడు విమల్ కుమార్ మాత్రం లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి వివరాలు లీక్ కాలేదని అన్నారు. తమ సర్వర్లలో సమాచారం ఉందని లీకైన డేటా మెగా డేటా మాత్రం విమల్ కుమార్ వెల్లడించారు.

    మరిన్ని వార్తల కోసం: వైరల్ వార్తలు

    అయితే ల్లికైన డేటాలో ఆర్డర్ వివరాలు, లావాదేవీల వివరాలు లేవని తెలుస్తోంది. ఒక బెంగళూరు స్టార్టప్ కంపెనీ గతేడాది ఆగష్టు నెలలో కూడా ఇదే విధంగా వివరాలు లీక్ అయ్యాయని చెబుతుండటం గమనార్హం.