చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది దంతాలు పుచ్చిపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది దంతాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య ఎదురవుతుంది. సరిగ్గా పళ్లపై శ్రద్ధ పెట్టకపోతే దంతక్షయం రావడంతో పాటు పుచ్చిపోయిన దంతాల వల్ల జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది. దంతాలు పుచ్చిపోతే తరచూ పంటి నొప్పి వేధించే అవకాశం ఉంటుంది.
Also Read: ఒత్తిడి నుంచి బయటపడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలివే..?
శరీర ఆరోగ్యానికి అతి ముఖ్యమైన వాటిలో దంతాలు ఒకటి. దంతాల విషయంలో శ్రద్ధ పెట్టకపోతే కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు ఉంటాయి. దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే వారంలో కనీసం ఒకటి లేదా రెండుసార్లు వేప పుల్లతో పళ్లను శుభ్రం చేసుకోవాలి. ఆహారం తిన్న వెంటనే మంచినీటితో నోటిని పుక్కలించుకుంటే మంచిది. పళ్లపై పచ్చగార ఉన్నవాళ్లు నెలకు ఒకసారి బేకింగ్ సోడాలో నిమ్మరసం వేసుకుని పళ్లు శుభ్రం చేసుకుంటే ఆ సమస్యతో పాటు పళ్లు పుచ్చిపోయే అవకాశాలు తగ్గుతాయి.
Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
ఎవరైతే విటమిన్ డి లోపంతో బాధ పడుతూ ఉంటాతో వాళ్లలో పళ్లు పుచ్చిపోయే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ కొంత సమయమైనా ఎండలో ఉంటూ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తక్కువగా తీసుకుంటే దంతాలు పుచ్చిపోయే అవకాశాలు తగ్గుతాయి. స్వీట్లు, హల్వా, చాక్లెట్లు తీసుకుంటే వెంటనే దంతాలను శుభ్రం చేసుకుంటే మంచిది. దంతాలు శుభ్రం చేసుకోవడం సాధ్యం కాకపోతే నోటిలో నీళ్లు వేసి పుక్కలించాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దంతాలు పుచ్చిపోతే వెంటనే డెంటిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆలస్యంగా చికిత్స తీసుకుంటే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు, పెద్దలు ప్రతిరోజూ రెండు సార్లు బ్రషింగ్ చేసుకోవాలి. రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు బ్రషింగ్ చేసుకోవాలని అంతకు మించి చేసుకోవాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.