Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద అంచనాలను మరింత పెంచుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సూర్య వంశీ సద్వినియోగం చేసుకున్నాడు.
సూర్యవంశీ ఆడిన తీరు పట్ల మాజీ క్రికెటర్లు.. సీనియర్ క్రికెటర్లు.. విశ్లేషకులు అభినందనలు జల్లు కురిపిస్తున్నారు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడని.. టీమ్ ఇండియాకు ఆశాదీపం లాగా మారిపోతాడని చెబుతున్నారు. అయితే ఈ సూర్య వంశీకి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడని.. మటన్ బాగా తింటాడని.. ఇప్పుడు అన్ని అలవాట్లు మార్చుకున్నాడని.. పూర్తిగా ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టాడని రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
సూర్య వంశీకి సంబంధించి అందరికీ తెలియని నిజాన్ని ఒక వ్యక్తి బయటపెట్టాడు. అతడు మరెవరు కాదు తెలుగు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. సూర్యవంశీ బిహారి నేపథ్యమున్న కుర్రాడు అయినప్పటికీ.. అతడి సామర్థ్యం తెలుగు గడ్డమీద బయటపడింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ బయటపెట్టారు. 2024 అండర్ 19 వరల్డ్ కప్ కంటే ముందు అతడి ఆటను వివిఎస్ లక్ష్మణ్.. ఇతర మాజీ క్రికెటర్లు చూశారు. విజయవాడలో ఆటోలో జరిగింది. అప్పుడు ఇండియా బీ జట్టు తరఫున వైభవ్ ఆడాడు. జట్టు తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. అప్పుడు కూడా జట్టుకు అనుకూలంగా మారిపోయాడు. ఇప్పుడు కూడా జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడని.. లక్ష్మణ్ పేర్కొన్నాడు.
“సూర్యవంశీ లో జరగాల్సిన మార్పు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా అతడి సామర్థ్యం. దాని మీద అతడు దృష్టి పెట్టాలి. మూడో మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. క్యాచ్ పట్టే విషయంలో కిందపడి, ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ అతడు మైదానం నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఫిజియో వచ్చాడు.. అయినప్పటికీ అతడు అదే ధోరణి కొనసాగించాడు. తన విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాడు. తన వల్ల జట్టుకు లభించే ప్రయోజనం విషయంలో కూడా వెనక్కి తగ్గడని” లక్ష్మణ్ పేర్కొన్నాడు. లక్ష్మణ్ సూర్య వంశీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు కారణం అవుతున్నాయి.






