Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి అత్యంత నాటకీయంగా అడుగుపెట్టినప్పటికీ.. ఆ అడుగును అత్యంత బలంగా నిర్మించుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఎవరూ సాధించలేని రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ తో తలపడినప్పుడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ తరఫున సూపర్ సెంచరీ చేశాడు. తన సూపర్ ఆట తీరుతో అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. అంతేకాదు ఐపిఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు.. వైభవ్ సూర్య వంశీ ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లను అర్థ శతకం సాధించి అదరగొట్టాడు.
Also Read : పది”లో వైభవ్ సూర్య వంశీ ఫెయిల్.. ఇదీ అసలు జరిగింది!
500 మిస్డ్ కాల్స్ వచ్చాయట
ఎవరైనా విజయం సాధిస్తే.. ఘన కీర్తిని అందుకుంటే వారికి దక్కే ప్రశంసలు మామూలుగా ఉండవు. వైభవ్ సూర్యవంశీ కి కూడా అదే అనుభవంలోకి వచ్చింది. గుజరాత్ జట్టుతో తలపడిన సందర్భంలో సూపర్ సెంచరీ చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 15 సంవత్సరాలు కూడా లేని వయసులో అతడు శతకం సాధించడం సీనియర్ ప్లేయర్లను కూడా ఆశ్చర్యపరిచింది. సునీల్ గవాస్కర్ మినహా మిగతా ప్లేయర్లు మొత్తం అతడిని ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు అతడి ప్రస్తావన సాగింది. అతడి గురించి పతాక శీర్షికల స్థాయిలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ అదేపనిగా ఫోన్లు వచ్చాయట. దీంతో తట్టుకోలేక అతడు నాలుగు రోజులపాటు తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడట. స్విచ్ ఆన్ చేస్తే దాదాపు 500 మిస్డ్ కాల్స్ ఉన్నాయని మెసేజ్లు వచ్చాయట..
దీనిపై వైభవ్ సూర్యవంశీ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు..” నేను శతకం చేసిన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేశారు. కానీ మాట్లాడే సమయం నాకు లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందువల్లే ఫోన్ నాలుగు రోజులపాటు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. దాదాపు 500 వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆ సందర్భంలో ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నాను. “నా చుట్టూ ఎక్కువ మంది ఉండడం ఇష్టం ఉండదు. నా పేరెంట్స్.. కొంతమంది స్నేహితులు ఉంటే చాలు. అప్పుడే నేను నా సహజ సిద్ధమైన ఆట తీరు ప్రదర్శిస్తాను. అందువల్లే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరుగులు రాబడుతున్నానని” వైభవ్ సూర్య వంశీ పేర్కొన్నాడు. సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్లో విపరీతంగా వెతికారు.. ముఖ్యంగా అతడు ఇష్టంగా ఏం తింటాడో శోధించారు.
Also Read : టెస్ట్ లకు దూరమైనా.. విరాట్ రేంజ్ తగ్గలేదు.. ఇదీ 1,050 కోట్ల దండయాత్ర..