Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: మటన్ మానేశాడు.. రోజుకు 600 చొప్పున మొదలుపెట్టాడు.. ఇదీ వైభవ్ సూర్య వంశీ...

Vaibhav Suryavanshi: మటన్ మానేశాడు.. రోజుకు 600 చొప్పున మొదలుపెట్టాడు.. ఇదీ వైభవ్ సూర్య వంశీ అంటే..

Vaibhav Suryavanshi: సూర్య వంశీ గురించి రోజుకు ఒక వార్త మీడియాలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతడు సెలబ్రిటీ. పైగా దూకుడు మీద ఆడుతున్నాడు. శ్రీలంక సిరీస్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. అతడు ఆకాశమే హద్దుగా చెలరేగే రకం. ఐపీఎల్ లో తన సత్తా ఏమిటో చూపించాడు. కొత్తగా తనను తాను ప్రూఫ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అయితే శ్రీలంక మైదానాలు అంత పట్టు లేకపోవడంతో సూర్య వంశీ.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు.

సూర్యవంశీ కి మటన్ అంటే చాలా ఇష్టం. గత ఐపిఎల్ లోనే దాన్ని పూర్తిగా మానేశాడు. డైట్ మొత్తం వేరే విధంగా మార్చుకున్నాడు. ప్రత్యేకంగా డైటీషియన్ ను నియమించుకున్నాడు. సాధ్యమైనంతవరకు తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మటన్ మానేసిన తర్వాత సూర్య వంశీ వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. సింగిల్స్ తీయడంలో కూడా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదే అతడి శ్రమ. ఇప్పుడు అతడు ప్రతిరోజు 600 పైగా బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతంలో కూడా అతడు ఇదే స్థాయిలో ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు తన ప్రాక్టీస్ మరింత పెంచాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడు మైదానంలోనే మునిగి తేలుతున్నాడు. అందువల్లే అతడు భారీగా పరుగులు చేయగలుగుతున్నాడు. శ్రీలంక మైదానాలు అతనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుత సిరీస్లో అంతగా పరుగులు చేయలేకపోతున్నాడు. కాకపోతే అతడు త్వరలోనే మళ్లీ పూర్వపు లయలోకి వస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సూర్య వంశీ గతంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి తల్లి అర్ధరాత్రి రెండు గంటలకు లేచేది. అతడికి భోజనాన్ని సిద్ధం చేసేది.. తండ్రి దాదాపు రెండున్నర గంటలు ప్రయాణించేవాడు. ఆ తర్వాత వాళ్లు కోచింగ్ సెంటర్ లోకి వెళ్లి పోయేవారు. కొడుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రాక్టీస్ చేస్తుంటే తండ్రి అక్కడే ఉండేవాడు. అతని కుమారుడి ఆట తీరు పరిశీలించేవాడు. ఇంత శ్రమ పడ్డాడు కాబట్టే.. సూర్య వంశీ ఈ స్థాయిలో ఆకట్టుకుంటున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

సూర్యవంశీ ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం వెనుక అతడి ప్రాక్టీసే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అతడు ఆడే విధానం ఇంత గొప్పగా ఉండడానికి ఆట మీద మక్కువ కారణమని వివరిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు కాలంలో అతడు మరింత రాటు తేలిపోతాడని.. టీమిండియా అతని చేతుల్లో సెక్యూర్డ్ గా ఉంటుందని మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version