Homeక్రీడలుక్రికెట్‌West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం. అతడు చేసిన అద్భుతం ముందు దాయాది బ్యాటర్లు చేతులెత్తేశారు. పెవిలియన్ వెళ్లిపోవడానికి క్యూ కట్టారు.

పాకిస్తాన్ జట్టుతో వెస్టిండీస్ ట్రిని డాడ్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అదరగొట్టాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బీభత్సంగా బౌలింగ్ వేసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ బ్యాటర్లు గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచారు. అతడి బౌలింగ్ తట్టుకోలేక తలవంచారు.

గ్రీవ్స్ 5 ఓవర్లలో.. ఓవర్ కు వికెట్ చొప్పున 5 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా అతని రికార్డ్ సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో గ్రీవ్స్ కు ఐదు వికెట్లు సాధించడం తొలిసారి. సరిగ్గా 2016లో జనవరి నెలలో జోహన్నెస్ బర్గ్ లో దక్షిణాఫ్రికా జట్టు మీద ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్.. వరుసగా నాలుగు వికెట్ల మెయిడెన్లు వేశాడు. ఇప్పుడు అతని రికార్డును గ్రీవ్స్ బద్దలు కొట్టాడు.

ఇక ఈ మ్యాచ్లో మూడో రోజు పాకిస్తాన్ 244/4 తో బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఈ దశలో గ్రీవ్స్ బంతిని అందుకున్నాడు. దీంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు కనిపించడం మొదలైంది. వరుసవ ఓవర్లలో సెంచరీ చేసిన షాన్ మసూద్ (109), మూడు పరుగులు చేసిన అమీర్ జమాల్.. 0 పరుగులకు ఆలీ ఉస్మాన్.. 12 పరుగులకు మహమ్మద్ రిజ్వాన్.. 0 పరుగులకు మహమ్మద్ అబాస్ ఔట్ అయ్యారు. భారీగా పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ పాకిస్తాన్ గ్రీవ్స్ దూకుడు ముందు తలవంచాల్సి వచ్చింది. ఫలితంగా 282 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక మూడవరోజు ఆట ముగిసిన తర్వాత వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ మీద 155 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. ఒకవేళ నాలుగో రోజు వెస్టిండీస్ బ్యాటర్లు ఎదురుదాడికి దిగి.. భారీగా పరుగులు చేస్తే.. అప్పుడు పాకిస్తాన్ జట్టుకు ఇబ్బంది తప్పదు.

గ్రీవ్స్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేశాడు. పాకిస్తాన్ బ్యాటర్లకు పదేపదే ఇబ్బంది కలిగించే విధంగా బంతులు విసిరాడు. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్ కాపాడుకోవడం కూడా కష్టంగా మారింది. మైదానం కూడా బౌన్సీగా ఉండడంతో గ్రీవ్స్ అద్భుతంగా బంతులు వేశాడు. దీంతో పాకిస్తాన్ బ్యాటర్లు తల వంచుకున్నారు. పరుగులు తీసే చోట.. వికెట్లు పడేసుకుని పరువు తీసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Oktelugu Epaper
Exit mobile version