Pakistan And Israel: సరిగ్గా కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా వెళ్లారు. ఏవో రంగు డబ్బాలను ప్రెసిడెంట్ ట్రంప్ కు చూపించారు. దానికి అతడు ఎగిరి గంతులు వేశాడు. తప్పకుండా చేద్దామంటూ మాటిచ్చాడు. ఇంతకీ ట్రంప్ కు మునీర్ చూపించిన ఆ రంగు డబ్బాలు మరేంటో కాదు.. ఖరీదైన ఖనిజాలు. అమెరికాకు దోచి పెట్టేందుకు మునీర్ అక్కడదాకా ఎందుకు వెళ్ళాడు అంటే.. అతడి పదవిని కాపాడుకోవడం కోసం.. అమెరికా కన్ను అతని మీద పడకుండా ఉండడం కోసం..
ఇక అప్పటినుంచి ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ విషయంలో సానుకూలంగా ఉండడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఉగ్రవాదులకు స్థావరమైన పాకిస్తాన్ దేశాన్ని.. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపే దేశంగా మార్చాడు. అయితే ఆ శాంతి చర్చలు విఫలమయ్యాయి. చివరికి ఈ చర్చలు జరిగిన హోటల్ బిల్లు కూడా పాకిస్తాన్ కట్టలేకపోయింది.
పాకిస్తాన్ తీరు అలా ఉంటే.. ఇజ్రాయిల్ అమెరికా విషయంలో మరో విధంగా స్పందిస్తుంది. ఇటీవల ఇరాన్ దేశంతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ కోసం అమెరికా రంగంలోకి వచ్చింది. ఈ యుద్ధం మీద ఇజ్రాయిల్ 30 రూపాయలు ఖర్చు పెడితే.. 70 రూపాయలు అమెరికా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. యుద్ధం వల్ల అమెరికా భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇప్పుడు ఇరాన్ కు ఇవ్వాల్సిన పరిహారం మొత్తం అమెరికాను చెల్లించాలి. యుద్ధం వల్ల ఇజ్రాయిల్ లాభపడింది. అమెరికా నష్టపోయింది. అంతేకాదు ఇరాన్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం తో మాకు సంబంధం లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు, అమెరికా చెప్పినట్టు వినాల్సిన అవసరం మాకు లేదని ఓపెన్ గా చెప్పేసింది. మా ఇష్టం మేము ఇదేవిధంగా ఉంటామని.. అమెరికా వెలుపడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించింది. ఇటీవల కాలంలో నేతన్యహు ను పదేపదే అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు. అప్పుడు ఇజ్రాయిల్ పెద్దగా కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇరాన్ దేశంతో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ మొహమాటం లేకుండా మాట్లాడుతోంది. అయినా అదేమైనా పాకిస్తానా.. అమెరికా చెప్పినట్టు వినడానికి..
