Rishabh Pant IPL News: 2024 ఐపీఎల్ వేలం జరుగుతున్నప్పుడు రిషబ్ పంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. దీనికి ప్రధాన కారణం 20 కి పైగా కోట్లు పెట్టి లక్నో జట్టు యజమాని గోయంక అతడిని కొనుగోలు చేయడమే. ఢిల్లీ నుంచి పంత్ బయటకు వచ్చి ఆ స్థాయిలో డబ్బు దక్కించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎంతో సీనియార్టీ ఉన్న ప్లేయర్లు కూడా ఆ స్థాయిలో ధర దక్కించుకోలేక ఇబ్బంది పడుతుంటే.. పంత్ మాత్రం సులువుగా ఆ పని చేయగలిగాడు. అంతేకాదు అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించ గలిగాడు.
ఆ స్థాయిలో డబ్బు పెట్టిన తర్వాత గోయంక ఎందుకు ఊరుకుంటాడు.. పంత్ మీద ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. మామూలుగా కాదు.. 2025 సీజన్లో ఒత్తిడి తట్టుకోలేక పంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. కొన్ని సందర్భాలలో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అంతేకాదు, ఓనర్ స్థానం నుంచి వన్ డౌన్, మిడిల్ ఆర్డర్.. లోయర్ ఆర్డర్ స్థాయికి తనను తాను దిగజార్చుకున్నాడు.. అయినప్పటికీ అతని ఆట తీరు మారలేదు. అతడి న్యాచురల్ స్టైల్ బ్యాటింగ్ కనిపించలేదు.
2026 సీజన్లో కూడా పంత్ అలానే ఉండిపోయాడు. ఆట తీరు మారలేదు. తన దూకుడు కనిపించలేదు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టే అతడు నిస్తేజంగా ఉండిపోయాడు. ఫలితంగా లక్నో జట్టు దారుణమైన ఓటములు ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలోనే తన కెప్టెన్సీ ని వదులుకుంటున్నట్టు పంత్ ప్రకటించాడు. ఫలితంగా లక్నో జట్టు 2027 సీజన్ కి కొత్త సారధిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జాతీయ మీడియాలో సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి.
పంత్ వచ్చే సీజన్ నాటికి ఢిల్లీ జట్టుకు వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. తనను నాయకుడిని చేసిన ఢిల్లీ మేనేజ్మెంట్ కు అతడు కృతజ్ఞతగా మళ్లీ అందులోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ జట్టు నుంచి కులదీప్ యాదవ్ లక్నోకు వెళ్ళిపోతున్నాడని కూడా తెలుస్తోంది. లక్నో జట్టు సారధిగా ఇప్పటికే తప్పుకున్నాడు. కాగా ఢిల్లీ కెప్టెన్ గా కొనసాగుతున్న అక్షర్ పటేల్ ను తప్పించి.. రాహుల్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.
