Homeక్రీడలుక్రికెట్‌15 year old cricket sensation: రేయ్ బుడ్డోడా.. 15 ఏళ్ళకే ఇలా చేస్తున్నావంటే.. పాతికేళ్లకి...

15 year old cricket sensation: రేయ్ బుడ్డోడా.. 15 ఏళ్ళకే ఇలా చేస్తున్నావంటే.. పాతికేళ్లకి ముఖేష్ అంబానీని మించిపోతావ్.

15 year old cricket sensation: అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపమానాలతో వర్ణించాల్సిన అవసరం లేదు. ఉత్ప్రేక్ష అలంకారాన్ని అన్వయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి గురించి సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రధాన మీడియా వరకు రాస్తూనే పోతున్నాయి. ఎందుకంటే అతడు సృష్టిస్తున్న సంచలనం అటువంటిది. ప్రతి మ్యాచ్ లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. 15 సంవత్సరాల వయసులోనే సంచలనాలు మొత్తం తన పేరు మీద […]

15 year old cricket sensation: అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపమానాలతో వర్ణించాల్సిన అవసరం లేదు. ఉత్ప్రేక్ష అలంకారాన్ని అన్వయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి గురించి సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రధాన మీడియా వరకు రాస్తూనే పోతున్నాయి. ఎందుకంటే అతడు సృష్టిస్తున్న సంచలనం అటువంటిది. ప్రతి మ్యాచ్ లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. 15 సంవత్సరాల వయసులోనే సంచలనాలు మొత్తం తన పేరు మీద రాసుకుంటున్నాడు. తన పేరులో ఉన్న సూర్య అనే పదానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నాడు. వైభవంగా.. సూర్య ప్రతాపంతో.. వంశీ లాగా వెలిగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ప్రతి సందర్భంలోనూ సింహ స్వప్నం లాగా నిలుస్తున్నాడు.

బీహార్ రాష్ట్రానికి చెందిన పదిహేను సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. గత ఏడాది ఐపిఎల్ లో అతడు విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడైతే అంతకుమించి అనే స్థాయిలో ఆడుతున్నాడు. పరుగులు కొట్టడాన్ని బూస్ట్ తాగినంత ఈజీగా చేస్తున్నాడు. షూ ధరించినంత సులభంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.. అసలు అతని వయసుకు.. ఆడుతున్న ఆటకు ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ అతడికి అలుపు లేదు. సొలుపు అంతకంటే లేదు. ఇలా ఆడుతున్న అతడు ఇప్పటికే అనేక రికార్డులను సృష్టించాడు. ఆ రికార్డులను టచ్ చేయాలంటే కూడా గొప్ప గొప్ప బ్యాటర్లు భయపడే స్థితి కల్పించాడు. ఇంకా ఎంతలా ఆడతాడో తెలియదు కానీ.. ఇప్పటికైతే సునామి తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు.

రాజస్థాన్ జట్టు నుంచి భారీగానే అందుకుంటున్న.. వైభవ్ సూర్య వంశీ.. మిగతా వాటి రూపంలో కూడా భారీగానే సొంతం చేసుకుంటున్నాడు. అతడి ఆటతీరును మెచ్చిన బిసిసిఐ ప్రతి మ్యాచ్ కు భారీగానే ఇస్తోంది. వచ్చిన డబ్బులను వృధా చేయకుండా సూర్య వంశీ.. తనకంటూ అద్భుతమైన కలల సౌదాన్ని నిర్మించుకుంటున్నాడు. బీహార్ రాష్ట్రంలో అతడు నిర్మించుకున్న ఇల్లు అద్భుతంగా ఉంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ ఇల్లు నిర్మాణం మొత్తం పూర్తి కానుంది. చూసేందుకు ఇంద్రభవనం మాదిరిగా కనిపిస్తోంది. ఈ ఇంటి నిర్మాణంలో సూర్య వంశీ తండ్రి పూర్తిగా తల మునకలై ఉన్నాడు. అటు ఐపీఎల్ షెడ్యూల్.. ఇంటి నిర్మాణంలో అతడికి ఊపిరి సలపకుండా ఉంది. అయినప్పటికీ తన కొడుకు విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాను నెరవేర్చుకోలేని కలను.. తన కొడుకు నిజం చేసి చూపించాడని అతడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

“15 సంవత్సరాల వయసులో స్కూల్ కు వెళ్లకుండా క్రికెట్ ఆటనే ఆశగా స్వాసించావు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించావు. అంతే వయసులో ఒక ఇంటిని కట్టుకుంటున్నావు. పాతిక సంవత్సరాల వయసు వచ్చేసరికి ముకేశ్ అంబానీ మించి పోయే విధంగా కనిపిస్తున్నావని” నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper