Vaibhav Surya Vanshi : వైభవ్ సూర్య వంశీ తొలి మ్యాచ్లో 30కి పైగా పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో మ్యాచ్ లోనూ భారీ స్కోర్ చేయలేకపోయాడు. ముచ్చటగా మూడో మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టుకు నిద్రలేని రాత్రి ని పరిచయం చేశాడు. మామూలుగా ఆడలేదు అతడు.. ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్.. ఏ బౌలర్ ని కూడా వదిలిపెట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే జైపూర్ మైదానంలో ఊచకోత కోశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ వయసులో సెంచరీ చేసి అద్భుతమైన రికార్డును అందుకున్నాడు. కేవలం 35 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు ఏకంగా 11 సిక్సర్లు కొట్టాడు.. మైదానం నలుమూలల బంతిని పరుగులు పెట్టించాడు.
దీంతో గుజరాత్ జట్టు విధించిన 210 రన్స్ టార్గెట్.. జస్ట్ జుజుబి అయిపోయింది. వైభవ్ సూర్య వంశీ సూపర్ సెంచరీ చేయడం.. రాజస్థాన్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వీల్ చైర్ నుంచి పైకి లేచి.. అమాంతం అభినందనలు తెలిపాడు. 14 సంవత్సరాల కుర్రాడు మైదానంలో వీర విహారం చేస్తుంటే ఉద్వేగంతో అలా చూస్తూ ఉండిపోయాడు. చివరికి వైభవ్ సూర్య వంశీ చేస్తున్న బ్యాటింగ్ చూసి.. గుజరాత్ ప్లేయర్లు కూడా మంత్ర ముగ్ధులు అయిపోయారు.
ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 33 బంతుల్లో 60 పరుగులు పూర్తి చేశాడు. వైభవ్ సూర్య వంశీ, జైస్వాల్ ఈ కథనం రాసే సమయం వరకు తొలి వికెట్ కు 166 పరుగులు జోడించారు.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025