Vaibhav Surya Vanshi : కానీ ఆ పిల్లలతో పోల్చి చూస్తే వైభవ్ సూర్యవంశీ చాలా విభిన్నమైన కుర్రాడు. ఇంకా మూతి మీద మీసం రాలేదు. యవ్వనం తాలూకు ఛాయలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అటువంటి ఈ కుర్రాడు మైదానంలో ప్రత్యర్థి ప్లేయర్లకు సింహ స్వప్నం లాగా మారాడు.. ఐపీఎల్ లో సంచలనంగా ఆవిర్భవించాడు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో నిప్పు కణికలాగా రాటు తేలాడు. కేవలం 14 సంవత్సరాల వయసులో.. ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఆ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఎవరైనా నమ్ముతారా.. రషీద్ ఖాన్ లాంటి మాంత్రికుడి బౌలింగ్లో అలా ముందుకొచ్చి సిక్సర్ కొడుతున్నాడు అంటే ఎవరైనా ఊహిస్తారా.. కానీ వీటన్నింటిని సూర్య వంశీ నిజం చేసి చూపించాడు. రాజస్థాన్ జట్టు కోల్పోయిన ఆనందాన్ని.. పోగొట్టుకున్న విజయాలను తిరిగి తెచ్చాడు. అందువల్లే ప్రస్తుత ఐపీఎల్ లో అనితర సాధ్యమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇష్టమైనవి వదులుకున్నాడు
వైభవ్ సూర్యవంశీకి మటన్ అంటే చాలా ఇష్టం. పిజ్జా కూడా ఇష్టంగా తింటాడు. అందువల్లే అతడు కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు శారీరక సామర్థ్యం చాలా అవసరం. ముఖ్యంగా వికెట్ల మధ్యలో పరుగులు తీయడం అత్యంత అవసరం. అందుకోసం ఆటగాళ్ళు తమ సామర్థ్యాన్ని కాపాడుకోవడం కోసం నోటికి తాళం వేస్తుంటారు. ముఖ్యంగా మాంసాహారం జోలికి వెళ్లరు. వైభవ్ సూర్య వంశీకి మటన్ అంటే విపరీతమైన ఇష్టం.. అయితే దానివల్ల లావు పెరుగుతారని.. అప్పుడు వికెట్ల మధ్య పరుగులు తీయడం సాధ్యం కాదని రాహుల్ ద్రావిడ్ చెప్పడంతో.. వైభవ్ సూర్య వంశీ తనకు ఎంతో ఇష్టమైన మటన్ కూరను తినడం మానేశాడు. జంక్ ఫుడ్ ను కూడా పూర్తిగా దూరంపెట్టాడు. రాజస్థాన్ జట్టులో డైటీషియన్ చెప్పినట్టుగానే తన ఫుడ్ మెనూ పూర్తిగా మార్చుకున్నాడు. ఉదయం పూట అత్యంత తేలికైన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. లంచ్ లోను రైస్ లేకుండా చూసుకుంటున్నాడు. ఇక రాత్రిపూట డిన్నర్ లో అయితే అత్యంత తేలికైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. మొత్తంగా రాజస్థాన్ జట్టులోకి వచ్చిన తర్వాత తన వాస్తవ శరీర బరువులో ఐదు కిలోలు తగ్గాడు. అందుకే మూడో మ్యాచ్లో ఏకంగా సూపర్ సెంచరీ చేశాడు. గుజరాత్ జట్టుకు పీడకలను మిగిల్చాడు. ఒక రకంగా తన భవిష్యత్తు సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని రవి శాస్త్రి లాంటి వ్యాఖ్యాత కామెంట్ చేశాడు అంటే.. అతడి బ్యాటింగ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు.
If Vaibhav Suryavanshi Century Today I will give 1000 Rupees to everyone who likes this tweet and Retweet #vaibhavsuryavanshi
#RRvsGT #RRvGT pic.twitter.com/n562E5geIJ
— Royal Tiger (@Shekhawat0005) April 28, 2025