Sam Karan vs Punjab : చెన్నై జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. మరీ ముఖ్యంగా పాయింట్లు పట్టికలో ఆఖరి స్థానాన్ని ఆక్రమించింది. తద్వారా చెన్నై జట్టు దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్నది. ధోని సారథ్యంలోనూ చెన్నై జట్టు ఓడిపోవడం ఆ జట్టు అభిమానులకు జీర్ణం కావడం లేదు. బుధవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ పంజాబ్ జట్టు చేతిలో ఓడిపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. రుతు రాజ్ గైక్వాడ్ కు గాయం కావడంతో.. అతడు ఈ టోర్నీలో చెన్నై జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయాడు.. దీంతో చెన్నై జట్టు సారధ్య బాధ్యతలు ధోనికి దక్కాయి. అతని నాయకత్వంలోనూ చెన్నై జట్టు విజయం సాధించలేకపోయింది. పైగా ఆటగాళ్ల తీరుపై ధోని అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.
Also Read :యజువేంద్ర చాహల్ “తీన్ మార్”.. ధనశ్రీ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డట్టేనా..
గొడవ జరిగిందా
పంజాబ్ తో బుధవారం నాటి మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ సామ్ కరణ్ 88 రన్స్ స్కోర్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ దశలో అతడు సెంచరీకి దగ్గరగా ఉండగా అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంతో అతనిపై అభినందనల జల్లు కురుస్తోంది. మైదానంలో వీరవిహారం చేసిన సామ్ కరణ్ అవుట్ అయ్యి పెవిలియన్ వస్తుండగా.. పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ అతడితో అనవసరంగా గెలుక్కున్నట్టు తెలుస్తోంది. దీనికి సామ్ కరణ్ కూడా గట్టిగానే బదులు ఇచ్చినట్టు సమాచారం.. మొత్తంగా పంజాబ్ జట్టు మేనేజ్మెంట్, సామ్ కరణ్ మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగిందని తెలుస్తోంది. ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరితమైన చక్కర్లు కొడుతోంది. ” ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ నుంచి ఏవో మాటలు వినిపించాయి. దానికి సామ్ కరణ్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. మొత్తంగా ఇరు పక్షాల మధ్య గట్టిగానే వాదనలు జరిగి ఉంటాయని అర్థమవుతుందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సామ్ కరణ్ గతంలో పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి ఆధ్వర్యంలో పంజాబ్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. దీంతో అతడి నాయకత్వాన్ని పంజాబ్ జట్టు వదులుకుంది. ఇక ప్రస్తుతం సామ్ కరణ్ చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. బుధవారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తనదైన ఆట తీరు ప్రదర్శించాడు. పంజాబ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపించాడు. గతంలో పంజాబ్ జట్టుకు ఆడిన నేపథ్యంలో.. పంజాబ్ బౌలర్ల – పాయింట్లు తెలుసు. అందువల్లే అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా ఆడాడు. మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. కాకపోతే చెన్నై ఆటగాళ్లు తదుపరిగా బలంగా బ్యాటింగ్ చేయలేకపోవడంతో.. భారీ స్కోర్ చేయలేకపోయింది.
Sam Curran seems to having issue with Punjab management pic.twitter.com/8qNS3aA2XU
— MSDian (@NitinMudiyala) April 30, 2025