Hit 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నాని (Nani)…తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే నాని చేస్తున్న సినిమాలు వరుస విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో రీసెంట్ గా ‘హిట్ 3’ (Hit 3) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ కొలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ మూవీకి ఫ్రాంచైజీగా కొనసాగుతూ వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో నాని ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేశాడు. ఇప్పటివరకు నాని అంటే ఫ్యామిలీ,కామెడీ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు అంటూ ఆయన మీద ఒక సాఫ్ట్ ఇంప్రెషన్ అయితే ఉండేది. కానీ ఈ సినిమాలో వైలెన్స్ కి పెద్ద పీట వేస్తూ చాలా డిఫరెంట్ గా ఉండే విధంగా ప్లాన్ చేశారు. నిజానికి నాని లాంటి హీరో మాస్ హీరోగా మారబోతున్నాడు అనేదానికి సింబల్ గా ఈ సీన్స్ ని అయితే తిరికెక్కిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన మొత్తం మాస్ సినిమాలే చేయబోతున్నాడు. కాబట్టి ప్రేక్షకులందరు అతన్ని మాస్ హీరో అనుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో వైలెన్స్ ని ఎక్కువగా యాడ్ చేసి పెట్టారు.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?
దానివల్ల సినిమా హిట్ అయిన ఫ్లాపైన పర్లేదు కానీ నాని మాత్రం మాస్ హీరోగా మారబోతున్నాడు అంటూ నిదానంగా జనాల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మొత్తానికైతే హిట్ 3 మూవీలో సస్పెన్స్ కలిగించే అంశాలు అయితే ఏమీ లేవు.
హిట్, హిట్ 2 సినిమాలు ఎంతో కొంత సస్పెన్స్ థ్రిల్లర్ గా ముందుకు సాగాయి. కానీ ఈ సినిమాలో ట్విస్టులు గాని, సస్పెన్స్ ని కలిగించే అంశాలు కానీ ఏమీ లేకుండా ఓన్లీ యాక్షన్ కి మాత్రమే పెద్ద పీట వేస్తూ ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పాలి. ఒకరకంగా నాని సినిమాల్లో కథ పరంగా చాలా బలమైన ఎలిమెంట్స్ అయితే ఉంటాయి.
అందులోనూ కథపరంగా స్కోప్ ఉన్నప్పటికి దానిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో మాత్రం ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్ అనే మరిచిపోయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇలా చేయమని నానినే శైలేష్ కొలన్ కి చెప్పాడా లేదంటే శైలేష్ కొలన్ ఇలాంటి ఒక పంథాను నమ్ముకొని ముందుకు సాగాడు అనేది తెలియదు.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?