USA: బంగ్లా పై అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలవలేదు.. జస్ట్ ఇది శాంపిలే.. అమెరికా లెక్క వేరే ఉంది..

అమెరికాలో 2019లో అమెరికన్ క్రికెట్ ఎంటర్ ప్రైజ్ అనే సంస్థ ఏర్పాటయింది. దీనిని quiped మేజర్ లీగ్ క్రికెట్ (MLC) సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా ప్రారంభించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 25, 2024 5:12 pm

USA

Follow us on

USA: టి20 క్రికెట్లో బంగ్లాదేశ్ ర్యాంకు 9. అమెరికా ర్యాంకు 19. అంటే దాదాపు పది స్థానాలు వ్యత్యాసం. పైగా బంగ్లాదేశ్ లో నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. మేలైన బౌలర్లు ఉన్నారు. చురుగ్గా కదిలే ఫీల్డర్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ పై అమెరికా విజయం సాధించింది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను, మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ దక్కించుకుంది. ఈ విజయంతో అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. వాస్తవానికి చాలామంది ఈ విజయాన్ని అమెరికా అడ్డి మారి గుడ్డి దెబ్బలో గెలిచిందనుకుంటున్నారు. కానీ, అమెరికా ఒక్కరోజులోనే ఈ ఘనత సాధించలేదు. వాస్తవానికి క్రికెట్ ప్రపంచాన్ని ఏలాలని ఆ జట్టు భావిస్తోంది.. ఇందుకోసం గత కొద్ది సంవత్సరాలుగా భారీగా కసరత్తు చేస్తోంది.

అమెరికాలో 2019లో అమెరికన్ క్రికెట్ ఎంటర్ ప్రైజ్ అనే సంస్థ ఏర్పాటయింది. దీనిని quiped మేజర్ లీగ్ క్రికెట్ (MLC) సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా ప్రారంభించారు. ఇతడి ఆధ్వర్యంలోని మేజర్ లీగ్ క్రికెట్ అమెరికాలో టి20 లీగ్ టోర్నీలను నిర్వహిస్తోంది. టోర్నీలు మాత్రమే కాకుండా అమెరికా దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తోంది. క్రికెట్ లో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. జీరో టర్ఫ్ వికెట్లు ఉన్న మైదానాలను అభివృద్ధి చేస్తోంది. కెనడా, యూరో దేశాలలో టి20 మ్యాచ్ లు నిర్వహిస్తోంది.. అంతేకాదు అమెరికాలో ACE ప్లాకీ టి20 లీగ్ కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అకాడమీలు, టర్ఫ్ వికెట్ మైదానాలను భారీగా నిర్మించింది.. MLC ప్రారంభానికి ముందు 26 టీమ్ పాత్ వే ఫ్రాంచైజీ టోర్నమెంట్ ను నిర్వహించింది.. ఆ తర్వాత ACE MLC ను మొదలుపెట్టింది. MiLC లో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసింది. సంవత్సరానికి 150 పైగా మ్యాచ్ లను MiLC లో నిర్వహించిందంటే క్రికెట్ పై ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు హ్యూస్టన్ ఓపెన్ పేరుతో లాంగ్ వీకెండ్ పాప్ అప్ వంటి టి20 టోర్నీలను కూడా నిర్వహించింది..

ఆండ్రీస్ గౌస్ వంటి ఒక ఆటగాడు అబుదాబి T10, ilt20 వంటి టోర్నీలలో ఆడతాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో సుమారు 80 మ్యాచ్లను అతడు ఆడతాడు.. ఒక ఆటగాడిగా అతడికి ఇన్ని అవకాశాలను MLC కల్పిస్తోంది. 2021లో గౌస్ దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత అతడు తన కెరియర్ కోసం అమెరికా వచ్చాడు. ఇప్పుడు టి20 లీగ్ లలో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. ” అమెరికాకు వచ్చినప్పటి నుంచి నా పవర్ గేమ్ పూర్తిగా మెరుగుపడింది. మేము గత మూడు సంవత్సరాలలో అనేక టీ20 మ్యాచ్ లు ఆడాం. నేను 100% మెరుగైన క్రికెటర్ గా రూపుదిద్దుకున్నాను. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత నా ఆట తీరు పూర్తిగా మారింది. జనవరిలో జరిగిన ilt 20 లో 50 బంతుల్లో 95 పరుగులు చేశానని” గౌస్ పేర్కొన్నాడు. గౌస్ మాత్రమే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ హర్మిత్ సింగ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఆ దేశ జట్టులో అత్యంత శక్తివంతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా అవతరించాడు. అతడిని బిషన్ సింగ్ బేడీతో పోల్చుతున్నారు. ఇక మరో ఆటగాడు హమ్రీత్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా మారాడు. తనను తాను పూర్తిగా ఆవిష్కరించుకొని, సరికొత్త క్రికెటర్ గా అభివృద్ధి చెందాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మొదటి టి20 లో 33 పరుగులతో.. ఆకట్టుకున్నాడు.

అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి MLC తీవ్రంగా కృషి చేస్తోంది. వివిధ దేశాలలో నిపుణులను దిగుమతి చేసుకుంటున్నది. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ కు కూడా ఈ సంస్థ భారీగా డబ్బులు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో నాలుగు లక్షల అమెరికన్ డాలర్ల లేయర్ పేమెంట్ ఉంది.. దాదాపు 35 మంది ప్రొఫెషనల్ క్రికెటర్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 20 టర్ఫ్ వికెట్ మైదానాలు నిర్మించింది.. ఇందుకోసం 80 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. క్రికెట్ కోసం ఇంత కృషి చేస్తోంది కాబట్టే.. అమెరికా బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ దక్కించుకుంది. అంతేకాదు, త్వరలో తమ దేశం వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలని భావిస్తోంది.