https://oktelugu.com/

Yakshini OTT: వంద మంది యువకులను చంపితేనే ఆ నాగకన్యకు మోక్షం… ఓటీటీలో బాహుబలి నిర్మాతల సిరీస్!

యక్షిణి టైటిల్ తో తెరకెక్కిన సిరీస్ స్ట్రీమింగ్ డేట్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. విశేషం ఏమిటంటే... బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సిరీస్ నిర్మించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 25, 2024 / 05:29 PM IST

    Yakshini OTT Release Date, Platform and Time

    Follow us on

    Yakshini OTT: ఓటీటీలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ కి కొదువే లేదు. ప్రతి వారం లెక్కకు మించిన థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా ఉంది డిస్నీ ప్లస్ హాట్. ఈ అంతర్జాతీయ సంస్థ ఇండియన్ మార్కెట్ ని కొల్లగొడుతుంది. విభిన్నమైన కంటెంట్ తో కూడిన చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి తెస్తుంది. తాజాగా మరో హారర్ సస్పెన్సు థ్రిల్లర్ తో తన చందాదారులకు కొత్త అనుభూతి పంచేందుకు సిద్ధమైంది.

    యక్షిణి టైటిల్ తో తెరకెక్కిన సిరీస్ స్ట్రీమింగ్ డేట్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. విశేషం ఏమిటంటే… బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సిరీస్ నిర్మించారు. ప్రసాద్ దేవినేని మరొక నిర్మాతగా ఉన్నారు. రాహుల్ విజయ్, వేదిక హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇటీవల యక్షిణి ట్రైలర్ విడుదల చేశారు. వేదిక ఈ సిరీస్లో మాయ అనే నాగ కన్య పాత్ర చేస్తుంది. అజయ్, మంచు లక్ష్మి కీలక రోల్స్ చేస్తున్నారు.

    యక్షిణి సిరీస్ కథ విషయానికి వస్తే.. మాయ(వేదిక)మానవుడిని ప్రేమించిన కారణంగా తన లోకమైన అలకాపురిలో ప్రవేశాన్ని కోల్పోతుంది. తన శాపం వీడి అలకాపురికి చేరాలంటే ఆమె వంద మంది యువకులను చంపాల్సి ఉంటుంది. అదే క్రమంలో అలకాపురిని తన వశం చేసుకోవాలని మహాకాల్(అజయ్)ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మాయను గెలిస్తే అలకాపురి తన సొంతం అయినట్లే.

    99 మందిని సులభంగా చంపిన మాయకు కృష్ణ(రాహుల్ విజయ్)ని చంపడం కఠినం అవుతుంది. మరి మాయ శాపం తీరి అలకాపురికి వెళ్లిందా? మాయతో ప్రేమలో పడ్డ కృష్ణ పరిస్థితి ఏమిటీ? మహాకాల్ లక్ష్యం నెరవేరిందా అనేది మిగతా కథ. మంచు లక్ష్మి సైతం ఈ సిరీస్ లో కీలక రోల్ చేశారు. ఆమె జ్వాలాముఖిగా కనిపించనుంది. హారర్, కామెడీ, రొమాన్స్, సస్పెన్సు అంశాలతో యక్షిణి సిరీస్ తెరకెక్కింది. దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించాడు. జూన్ 14 నుండి స్ట్రీమ్ కానుంది.