India Vs Pakistan Asia Cup 2023: భారత్‌తో జరిగిన సూపర్–4 మ్యాచులో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. ఏ దశలోనూ కనీసం పోరాటం చూపించలేకపోయిన ఈ టీం.. పరమ చెత్త పెర్ఫామెన్స్‌తో ఘోరమైన ఓటమినికి మూటగట్టుకుంది. రిజర్వ్ డేను 147/2తో ప్రారంభించిన భారత్‌కు కేఎల్.రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే స్కోరు అందించారు. వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది.
లక్ష్య చేదనలో చతికిలబడి..
అనంతరం 357 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారనే చెప్పాలి. ఆరంభంలో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ అద్భుతమైన స్వింగ్‌తో పాక్ ఓపెనర్లను వణికించారు. ఇక ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో ఆ టీం కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది.
బ్యాటింగ్ చేయని ఇద్దరు బౌలర్లు..
అయితే పాక్ ఓడినా కూడా ఆ టీం చివరి ఇద్దరు బ్యాటర్లు హారిస్ రవూఫ్, నసీం షా క్రీజులోకి రాలేదు. వీళ్లిద్దరూ బౌలర్లే కాబట్టి వచ్చినా ఫలితంలో పెద్ద మార్పు వచ్చేది కాదు. కానీ అసలు ఈ ఇద్దరు ఎందుకని మ్యాచ్ ఆడలేదని చాలా మందికి అనుమానం వచ్చింది.
ఇద్దరికీ గాయాలు..
భారత్ బ్యాటింగ్ సమయంలో ఈ ఇద్దరు బౌలర్లు గాయపడ్డారు. దీంతోనే బ్యాటింగ్‌కు రాలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఆ తర్వాత శ్రీలంకతో పాక్ ఆడే మ్యాచ్‌లో కూడా వీళ్లిద్దరూ ఆడటం అనుమానే అని సమాచారం. ఆదివారం మ్యాచ్ ఆగిన తర్వాత తనకు నడుం ఇబ్బంది పెడుతోందని రవూఫ్ చెప్పాడట. కుడి వైపు నడుం నొప్పిగా ఉండటంతో అతను సోమవారం నాడు ఆటలో పాల్గొనలేదు. ఇక భారత బ్యాటింగ్‌లో 49వ ఓవర్ వేస్తున్న సమయంలో నసీం షాకు గాయమైంది. బౌలింగ్ వేసే భుజానికి గాయం అవడంతో అతను మైదానం వీడాడు. ఈ కారణంగానే వీళ్లిద్దరూ చివరకు పాక్ తరఫున బ్యాటింగ్‌కు కూడా రాలేదు. వాళ్లిద్దరికీ స్కానింగ్ తీయించామని, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇద్దరిపై ఒక నిర్ణయం తీసుకుంటామని పీసీబీ వర్గాలు చెప్తున్నాయి.
వారి స్థానాల్లో..
ఒకవేళ వీళ్లిద్దరూ ఈ వారంలో కోలుకోకపోతే.. ఈ స్థానాలను భర్తీ చేయడానికి షహనవాజ్ దహానీ, జమన్ ఖాన్‌లకు బ్యాకప్‌గా పీసీబీ పిలుపు అందించింది. రవూఫ్, షా స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత.. అవసరమైతే వాళ్ల రిప్లేస్‌మెంట్ కోసం ఏసీసీ టెక్నికల్ కమిటీకి పీసీబీ అభ్యర్థన పంపుతుంది.