Homeక్రీడలుIndia Vs Pakistan: భారత్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బా.. ఆసియా కప్‌ మ్యాచ్‌ విన్నింగ్‌పై మీమ్స్‌!

India Vs Pakistan: భారత్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బా.. ఆసియా కప్‌ మ్యాచ్‌ విన్నింగ్‌పై మీమ్స్‌!

India Vs Pakistan: కొద్ది కాలంగా వరుస విమర్శలతో సతమతమవుతున్న భారత్‌ జట్టు తన సత్తాను చాటి విమర్శకుల చేతే ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటుంది. నాలుగు రోజుల క్రితం కూడా భారత జట్టు పాక్‌ బౌలర్లను చూసి భయపడుతోందని కొంతమంది ట్రోల్‌ చేశారు. పాక్‌ బౌలర్లను ఎదుర్కొలేకపోతున్నారని చాలా మంది కామెంట్స్‌ చేశారు. వీటికి భారత్‌ క్రికెటర్లు అటు వ్యాటింగ్‌తో.. ఇటు బౌలింగ్‌తో సమాధానం చెపాపరు. వరణుడు పదే పదే మ్యాచ్‌కు అడ్డుపడినా.. ఆటంకాలను అధిగమించి అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన మ్యాచ్‌లో తమ విజయాన్ని టీం ఇండియా కానుకగా ఇచ్చింది.

పాక్‌ బౌలర్లను చీల్చి చెండాడి..
పాక్‌ బౌలింగ్‌ కి ఎదురు వెళ్లే సత్తా లేదు అంటూ వచ్చిన విమర్శలను పటాపంచలు చేస్తూ ఫీల్డ్‌లో పరుగుల వర్షం కురిపించారు. ఒకపక్క టీం ఇండియన్‌ బ్యాట్స్‌మెన్లు పరుగుల వర్షం కురుస్తుంటే ఆ ధాటికి ఎంటర్‌ అయిన వరుణుడు కూడా మ్యాచ్‌ ను ఆసక్తిగా చూడడం కోసం తన వర్షాన్ని ఆపేశాడు.

India Vs Pakistan
India Vs Pakistan

వార్‌ వన్‌సైడే..
భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో వార్‌ వన్‌సైడ్‌ అయింది. భారత ఆధిపత్యానికి పాక్‌ బ్యాట్స్‌మెన్లు తలొగ్గారు. దీంతో 228 పరుగుల భారీ తేడాతో భారత్‌ పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఇద్దరు బౌలర్లు అయితే బ్యాటింగ్‌కు కూడా రావడానికి వెనుకాడారు.

భారీ టార్గెట్‌..
ఇక టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి టీమిండియా 356 పరుగులు చేసింది. తన బ్యాట్‌ కు మరొకసారి పని చెప్పిన విరాట్‌ కోహ్లీ.. 94 బంతులలో 122 పరుగులు చేసి నాట్‌ అవుట్‌ గా నిలిచాడు. రాహుల్‌ కూడా 106 బంతులలో 111 పరుపులు చేసి మరొక సెంచరీని టీం ఇండియాకు జత చేశాడు.

టపటపా పెవిలియన్‌కు..
మ్యాచ్‌కి మధ్య మధ్యలో వాన అంతరాయం కలిగిస్తున్నా.. మొదలు పెట్టిన వెంటనే తిరిగి పుంజుకున్న టీమ్‌ ఇండియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. వాన చినుకులు టపటపా పడ్డట్టు పాకిస్తాన్‌ ఆటగాళ్ల వికెట్లను కూడా టపటపా పడగొట్టారు.

సోషల్‌ మీడియాలో మీమ్స్‌
ఈ విజయానికి సంబరపడిపోయిన అభిమానులు సోషల్‌ మీడియాలను పలు రకాల మీమ్స్‌ తో నింపేశారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా విరాట్‌ కోహ్లీ విశ్వరూపం.. రకరకాల యాంగిల్స్‌ లో ఫొటోలు పెట్టి.. క్యాచీ ట్యాగ్‌ లైన్స్‌తో బాగా పాపులర్‌ చేశారు. ముఖ్యంగా మొన్న కింగ్‌ భయపడ్డాడు అని పాకిస్తాన్‌ అభిమానులు చేసిన మీమ్స్‌తో హర్ట్‌ అయిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు తమ స్వీట్‌ రివెంజ్‌ తీర్చుకుంటున్నారు. భారత్‌ దెబ్బ.. పాక్‌ అబ్బా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular