Homeక్రీడలుTrump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతి..

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో ప్రజాప్రతినిధులు సమాచార వ్యవస్థలను బలంగా నిర్వహిస్తున్నారు. దీనికోసం చాలామంది వ్యక్తులను నియమించుకుంటున్నారు. ఫోటోలు.. వీడియోలు.. వార్తలు.. ఇంటర్వ్యూలు.. సేవా కార్యక్రమాలు.. ఏం చేసినా సరే వెంటనే ప్రజలకు తెలిసేలా చూసుకుంటున్నారు. మనదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంతటి వ్యవస్థలను కొనసాగిస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా […]

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో ప్రజాప్రతినిధులు సమాచార వ్యవస్థలను బలంగా నిర్వహిస్తున్నారు. దీనికోసం చాలామంది వ్యక్తులను నియమించుకుంటున్నారు. ఫోటోలు.. వీడియోలు.. వార్తలు.. ఇంటర్వ్యూలు.. సేవా కార్యక్రమాలు.. ఏం చేసినా సరే వెంటనే ప్రజలకు తెలిసేలా చూసుకుంటున్నారు.

మనదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంతటి వ్యవస్థలను కొనసాగిస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ఉండాలి.. అంతకుమించి అనే స్థాయిలోనే కదా ఉండేది ఆయన.. అందువల్లే ట్రూత్ అనే సోషల్ యాప్ వాడుతుంటారు ట్రంప్. పైగా ప్రతి విషయాన్ని కూడా వెంటనే ట్రూత్ ద్వారా ఆయన బయట పెడుతూనే ఉంటారు.

ట్రంప్ కు ప్రచార పిచ్చి విపరీతంగా ఉంటుంది. ప్రపంచంలో ఏం జరిగినా సరే తానే చేసినట్టు చెప్పుకుంటారు. గిట్టని దేశాలతో యుద్ధాలు సాగించి.. ఆ తర్వాత చర్చలకు తానే పిలిచి.. శాంతి స్థాపనకు కృషి చేసినట్టు బిల్డప్ ఇస్తుంటారు. కేవలం ప్రపంచ దేశాల మీద మాత్రమే కాకుండా.. చివరికి ఫుట్బాల్ విషయంలో కూడా ట్రంప్ తన ప్రచార పిచ్చిని తగ్గించుకోలేదు. అమెరికా అధ్యక్షుడు స్థాయిలో ఆయన ఆభాసుపాలయ్యారు. ఈ సంఘటన ఫిఫా వరల్డ్ కప్ ప్రధానోత్సవంలో చోటుచేసుకుంది.

వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ నిలిచిన తర్వాత.. ట్రోఫీ అందజేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ట్రంప్ వచ్చారు. మ్యాచ్ లో స్పెయిన్ గెలిచిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ రోడ్రికి కి ట్రంప్ ట్రోఫీ ఇచ్చారు. ఆ తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీని అందుకుని సంబరాలు జరుపుకోవడం ప్రారంభించారు. అయితే అప్పటికి ట్రంప్ పోడియం మీదనే ఉన్నారు. కెమెరా ఫ్రేమ్లో కనిపించడానికి ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో స్పెయిన్ ప్లేయర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. చివరికి స్పెయిన్ కెప్టెన్ ట్రంప్ చేతిని పట్టుకొని పక్కకు వెళ్ళమని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా దర్శనమిస్తోంది. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ట్రంప్ అక్కడ నిలబడ్డారని.. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ ప్రచార పిచ్చి పీక్స్ లో ఉందని, చివరికి దీనిని కూడా వదిలిపెట్టలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper