https://oktelugu.com/

Navratri Day 7 : నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజు అమ్మవారి అవతారం ఏదో తెలుసా? ఎలాంటి పూజలు చేస్తారంటే?

నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3న ప్రారంభం అయ్యాయి. 12 న ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమించే దేవి 7వ రోజు కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి పూజలు ఉంటాయో తెలుసుకుందామా..?

Written By:
  • Srinivas
  • , Updated On : October 9, 2024 / 10:12 AM IST

    Navratri Day 7

    Follow us on

    Navratri Day 7 :  దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఆడంబరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సెలవు దినాలు కావడంతో విద్యార్థుల నుంచి పెద్దవారు అమ్మవారి మండపాల వద్ద ఉంటూ సందడి చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆదిశక్తి అనుగ్రహం పొందుతున్నారు. పార్వతి దేవి నవరాత్రి ఉత్సవాల్లో రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో కనిపించిన దేవీ ఆ తరువాత వివిధ రూపంలో కనిపిస్తుంది. అయితే నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3న ప్రారంభం అయ్యాయి. 12 న ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమించే దేవి 7వ రోజు కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి పూజలు ఉంటాయో తెలుసుకుందామా..?

    దుష్ట శక్తులను సంహరించేందుకు దేవతలు కొన్ని అవతారాలు ఎత్తుతారు. పార్వతి దేవి వివిధ రూపాల్లో కనిపించి దుష్టులను అంతం చేశారు. ఈ నేపథ్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవానీ మాత రోజుకో రూపంలో కనిపిస్తూ భక్తులను అలరిస్తూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఇప్పటి వరకు వివిధ అలంకరణలో కనిపించిన అమ్మవారు ఏడో రోజు కాళరాత్రి గా కనిపించనున్నారు. అతి భయంకరమైన రూపంలో ఉన్న అమ్మవారు కాళికా మాతగా కనిపిస్తాయి.

    పాప వినాశనం చేసేందుకు అమ్మవారు కాళికా మాతగా అవతరించారని హిందూ శాస్త్రం చెబుతుంది. అయితే ఈరోజు అమ్మవారు రాయల్ బ్లూ కలర్లో కనిపించేలా అలంకరిస్తారు. చెడును అంతం చేసి మంచికి మార్గం చూపే రూపమే కాళరాత్రి రూపం. ఈ సందర్భంగా కష్టాలు, బాధలు ఉన్న వారు ఈరోజు దుర్గాదేవికి పూజలు చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే కొందరికి శని గ్రహం వల్ల బాధపడేవారు సైతం ఈరోజు అమ్మవారి నుంచి ఆశీస్సులు పొందడం వల్ల జీవితంలో అన్నీ సంతోషాలే ఉంటాయని చెబుతున్నారు.

    అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి? అనే సందేహం ఉంటుంది. సాధారణ రూపం కంటే ఈరోజు విభిన్న రూపంలో కనిపించే అమ్మవారు ఆగ్రహంతో ఉంటారని అంటారు. అందువల్ల అర్దరాత్రి వికసించే జాస్మిన్ పూలను అమ్మవారికి సమర్పించాలి. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి ఆ తరువాత షోడశోపచారాలు చదవాల్సి ఉంటుంది. ఆ తరువాత చివరిగా అమ్మవారికి ప్రత్యేక శ్రద్దలతో నమస్కరించాలి. ఈరోజు పూజలు చేయడం వల్ల శరీరంలో ఉన్న భయం పోయి ధైర్య సాహసాలు వస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం రోజంతా నిష్టంగా ఉండడం వల్ల అనుకున్నది సాధిస్తారని అంటున్నారు.

    నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.సాయంత్రం మండపాల వద్ద దాండియా ఆటలు ఆడుతున్నారు. కొందరు మహిళలు అమ్మవారి సేవలో ఉంటూ మండపాల వద్దే గడుపుతున్నారు. తొమ్మిదిరోజుల పాటు దుర్గామాత కోసం పూజలు చేయడం వల్ల ఏడాది పాటు జీవితం చక్కగా ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే కుటుంబలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని చెబుతున్నారు