Pawan Wife : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడడంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా(Anna Lezinova) తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నేడు బయలుదేరింది. రేపు ఉదయం దర్శించుకోనున్న అన్నా లెజినోవా, కాసేపటి క్రితమే శ్రీవారికి తలనీలాలు సమర్పించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. క్రైస్తవ మతస్తురాలు కావడంతో తిరుమలలోకి అడుగుపెట్టగానే డిక్లరేషన్ ఫార్మ్ మీద సంతకాలు చేసింది అన్నా లెజినోవా. అనంతరం ఆమె గోవిందా నామాన్ని సమర్పిస్తూ తలనీలాలను అర్పించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇతర మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ, అన్నా లెజినోవా హిందూ దేవుళ్లపై, హిందూ సంప్రదాయాలపై చూపిస్తున్న ప్రేమకు అందరూ ముగ్దులయ్యారు.
మన మతాన్ని ప్రేమించు, పర మతాన్ని గౌరవించు అనే సనాతన ధర్మం నియమాన్ని పవన్ కళ్యాణ్ తన సతీమణి కి అణువణువునా వ్యాప్తి చేశాడు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్నా లెజినోవా ఎన్నో సందర్భాల్లో మన హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలిచి ఇంటికి వచ్చినప్పుడు ఆమె మెగా కుటుంబ సభ్యులతో నడుచుకున్న విధానం నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ చెప్పులను సైతం ఆమె తన చేతులతో పట్టుకొని తీసుకోవడం వంటివి అందరినీ ఆకర్షించాయి. ఇవన్నీ చూస్తుంటే అన్నా లెజినోవా మంచి అమ్మాయి మాత్రమే కాదు, మన తెలుగు సంప్రదాయాలను నియమ నిష్ఠలతో అనుసరించే అమ్మాయి అనొచ్చు. ఎంతోమంది మహిళలు తెలుగు వాళ్ళు అయినప్పటికీ మన సంప్రదాయాలను విస్మరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లందరికీ అన్నా లెజినోవా ఒక ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తిరుమలకు అన్నా లెజినోవా ఒంటరిగా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ OSD మరియు ఆయన సిబ్బంది ఆమెతో వచ్చారు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. రేపు ఆయన హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొనే కార్యక్రమం ఉండడంతో ఆయన రాకుండా, కేవలం తన సతీమణిని తిరుమలకు పంపారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మే 9 న ఈ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ చిత్రం మే9 న విడుదల అవ్వడం కష్టమే అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. చూడాలి మరి ఏమి జరగబోతుందో.
కళ్యాణ్ గారి సతీమణి అనా కొణిదల గారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.
హిందూ మతాన్ని అనుసరించే నేను ఎంతో గర్వపడుతున్నాను.
అన్యమతం నుండి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి @PawanKalyan pic.twitter.com/u0BkPgP98H— Keerthana Paringisetti (@Keerthana_JSP) April 13, 2025