Tilak Verma : దక్షిణాఫ్రికా సిరీస్ తోనే కాదు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ తిలక్ వర్మ మెరిశాడు. ఏకంగా టాప్ -10 జాబితాలోకి రాకెట్ లాగా దూసుకొచ్చాడు. 69 స్థానాలను సులభంగా ఎగబాకి సూర్యకుమార్ యాదవ్ స్థానానికి ఎక్కు పెట్టాడు. అంతేకాదు అతడిని పక్కకు నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించాడు.. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా సంచలనం హెడ్, ఇంగ్లాండ్ ఆటగాడు సాల్ట్ మొదటి రెండు స్థానాలలో కొనసాగుతున్నారు. తిలక్ వర్మ తన టీ20 కెరియర్లో టాప్ -10 లో నిలవడం ఇదే ప్రథమం. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా రెండు మ్యాచ్లలో వరుసగా రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో తిలక్ వర్మ 198 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. 280 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్లలో 20 సిక్సర్లు కొట్టాడు.
సంజు 22వ స్థానం
ఇక దక్షిణాఫ్రికా సిరీస్ లో తిలక్ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకున్న ఆటగాడు సంజు శాంసన్. అతడేకంగా 17 స్థానాలను మెరుగుపరుచుకుని 22వ ర్యాంకులోకి చేరుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్ లలో సంజు ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. ఇతడి తర్వాత యశస్వి జైస్వాల్ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాడు.. రుతు రాజ్ గైక్వాడ్ 15వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రెండు స్థానాలను మెరుగుపరచుకొని మొత్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 13వ ర్యాంకులో ఉన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాన్సన్ 14వ ర్యాంకు దక్కించుకున్నాడు. అంతకుముందు అతడు 65వ ర్యాంకులో ఉన్నాడు. ఇటీవల భారత జట్టుపై జరిగిన మూడవ టి20 లో కేవలం 17 బంతులు ఎదుర్కొని అతడు 54 పరుగులు చేశాడు. ఇక భారత జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పది స్థానాలను మెరుగుపరచుకొని 13 వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలర్ అర్ష్ దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరచుకొని టాప్ -10 లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు 9వ ర్యాంకులో ఉన్నాడు..రవి బిష్ణోయ్ ఒక స్థానాన్ని పోగొట్టుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాడు.. టి20 ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో దక్కించుకుంది. ఇక భారత్ t20 వరల్డ్ కప్ తర్వాత ఓటమి అనేది లేకుండా ముందుకు సాగుతోంది.. దక్షిణాఫ్రికాపై టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం భారత్ జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పై వరుసగా సిరీస్ లు సొంతం చేసుకుంది. ఇందులో భారత్ జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై ఒక్కో మ్యాచ్ ఓడిపోయింది. బంగ్లాదేశ్, శ్రీలంకలపై తలపడి t20 సిరీస్ లను వైట్ వాష్ చేసింది.