Gautam Gambhir :హెడ్ కోచ్ గా నియమితులైన నాటి నుంచి గౌతమ్ గంభీర్ మారిపోయాడు. జట్టు ఆటగాళ్లతో కలిసిపోవడం మొదలుపెట్టాడు. అయితే ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. ఇప్పుడు త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ పై ఉత్కంఠ ఏర్పడింది. ఆటగాళ్లు మాత్రమే కాకుండా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యాన్ని కూడా నిర్ణయించనుంది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. దీంతో గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు గనుక గెలిస్తే గౌతమ్ గంభీర్ పై ఉన్న అపప్రద తొలగిపోతుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సీరియస్ లో భారత ఆటగాళ్లు స్పిన్ ట్రాక్ లపై తేలిపోవడం గౌతమ్ గంభీర్ ను ఇబ్బందికి గురిచేసింది. పదేపదే శిక్షణ ఇచ్చినప్పటికీ ఆటగాళ్లు అలా ఔట్ కావడం గౌతమ్ గంభీర్ ను మాత్రమే కాదు సగటు భారతీయ క్రికెట్ అభిమానిని కూడా ఆవేదనకు గురి చేసింది. ఆస్ట్రేలియా మైదానాలు పేస్ తో పాటు స్పిన్ ట్రాక్ లుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ మైదానాలపై భారత ఆటగాళ్లు ఎలా నిలదొక్కుకుంటారనేది ఆసక్తి కరం.. ఈ సమస్యను అధిగమించడానికి గౌతమ్ గంభీర్ ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించబోతాడో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వారిద్దరూ నిలబడాలి
తొలి టెస్ట్ కు రోహిత్ దూరమయ్యాడు. అడిలైడ్ టెస్ట్ ద్వారా అతడు జట్టులో చేరుతాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్ లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. విరాట్ పూర్తిగా నిరాశపరచాడు. వీరిద్దరూ 35+ వయసులో ఉన్నారు కాబట్టి తదుపరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేది అనుమానమే. అలాంటప్పుడు ఈ సిరీస్లో వారు సత్తా చాటాల్సి ఉంది. మరి వీరి విషయంలో గౌతమ్ గంభీర్ ఎలాంటి ప్రణాళిక రూపొందించాడనేది తెలియాల్సి ఉంది. వీరిద్దరూ ఆడితేనే జట్టుకు కొండంత బలం.. మరోవైపు జట్టులో యువ ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ విశేషమైన ప్రాధాన్యం ఇచ్చాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పై పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచాడు. అతడిని ఆల్ రౌండర్ గా బరిలోకి దింపుతున్నాడు.. న్యూజిలాండ్ సిరీస్ లో మెరుగ్గా ఆడని ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇచ్చాడు గౌతమ్. కానీ ఈసారి ఆ విధానాన్ని కొనసాగించడం లేదు. కచ్చితంగా ప్రదర్శన చూపిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నాడని తెలుస్తోంది. ఒకప్పుడు రవి శాస్త్రి కూడా ఇదే విధానాన్ని అనుసరించాడు. అందువల్లే భారత జట్టు విదేశీ గడ్డపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రవి శాస్త్రి కోచ్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై టెస్ట్ సిరీస్ గెలిచింది. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా భారత జట్టు ఆస్ట్రేలియాపై మరోసారి గెలుపు సొంతం చేసుకుంది. అయితే ఇదే వారసత్వాన్ని కొనసాగించేందుకు గౌతమ్ గంభీర్ జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఇక ఈ సిరీస్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టి20 ప్రపంచ కప్ 2026, వన్డే ప్రపంచ కప్ 2027 వంటి మెగాటోర్నీలు ఉన్నాయి. వాటన్నింటిలో భారత్ సత్తా చాటాలంటే ముందు గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా గండం నుంచి గట్టెక్కించాలి. అది జట్టును మాత్రమే కాదు, గౌతమ్ గంభీర్ బాధ్యతను కూడా కాపాడుతుంది.