https://oktelugu.com/

Victory Venkatesh : కమెడియన్ అలీ చిత్రాన్ని రీమేక్ చేసి పరువు పోగొట్టుకున్న విక్టరీ వెంకటేష్.. ఇలాంటి అవమానం ఏ హీరోకి రాలేదేమో!

వెంకటేష్ సినిమాలు కూడా ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి కానీ, అవి ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి. కారణం వెంకటేష్ నటనని మ్యాచ్ చేయలేకపోవడమే. అయితే వెంకటేష్ కమెడియన్ అలీ హీరో గా నటించిన ఒక సినిమాని రీమేక్ చేసి, భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా!.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 10:01 PM IST

    Victory Venkatesh

    Follow us on

    Victory Venkatesh : సీనియర్ హీరోలలో అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన నటుడు విక్టరీ వెంకటేష్. కానీ మాతృక సినిమాలకంటే వెంకటేష్ చేసే రీమేక్ సినిమాలే చూసేందుకు ఎంతో బాగుంటాయి. అయితే రీమేక్ సినిమా అంటే అంత తేలికైన విషయం కాదు. కత్తి మీద సాము లాంటిది. ఒక హీరో నటనని చూసిన తర్వాత, ఆ హీరో నటనని మర్చిపోయే విధంగా చేస్తేనే రీమేక్ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అంత అద్భుతంగా నటించేవాడు కాబట్టే వెంకటేష్ రీమేక్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యేవి. వెంకటేష్ సినిమాలు కూడా ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి కానీ, అవి ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి. కారణం వెంకటేష్ నటనని మ్యాచ్ చేయలేకపోవడమే. అయితే వెంకటేష్ కమెడియన్ అలీ హీరో గా నటించిన ఒక సినిమాని రీమేక్ చేసి, భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా!.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో కమెడియన్ అలీ, ఎస్వీ కృష్ణ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘యమలీల’ అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడు టీవీ లో ప్రసారమైన టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతుంటాయి. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని వెంకటేష్ హిందీ లో రీమేక్ చేసాడు. ‘టక్ దీర్ వాలా’ పేరుతో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. తెలుగు లో దర్శకత్వం వహించిన ఎస్వీ కృష్ణ రెడ్డి హిందీ లో కూడా దర్శకత్వం వహించాడు. కానీ తెలుగులో క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయలేకపోయారు. అలా వెంకటేష్ కెరీర్ లో ఈ చిత్రం ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోయింది. ఈ సినిమా యూట్యూబ్ లోని సురేష్ ప్రొడక్షన్స్ ఛానల్ లో అందుబాటులో ఉంది. ఎవరైనా చూడాలని అనుకుంటే చూడండి.

    ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ అనీల్ రావిపూడి దర్శకత్వం లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ తో F2, F3 వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అనిల్ రావిపూడి, మళ్ళీ ఆయనతో మూడవసారి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ చిత్రంతో వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరో గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టబోతున్నాడని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.