DC Vs RCB IPL 2025: విరాట్ కోహ్లీ అన్నిసార్లు దూకుడుగానే ఉండడు. మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ ను అంచనా వేస్తూ..పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తుంటాడు. అంటే అవసరానికి తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకుంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీ అంటే అందరూ పడి చచ్చిపోతుంటారు. విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు.. ఇప్పటికే అతడు 443 రన్స్ తో తిరుగులేని స్థాయిలో ఉన్నాడు. అయితే ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. వాస్తవానికి ఓపెనర్ గా వచ్చిన విరాట్ తనకు అలవాటైన దూకుడును పక్కన పెట్టాడు. సొంత మైదానంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆడాడు. ఎందుకంటే నిండా 30 పరుగులు చేయకుండానే బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గనుక విరాట్ దూకుడుగా ఆడితే మొదటికే మోసం వస్తుంది. పైగా ఢిల్లీ బౌలర్లు విపరీతమైన దూకుడు మీద ఉన్నారు. అక్షర్ పటేల్ అదరగొట్టే రేంజ్ లో బౌలింగ్ వేస్తున్నాడు. కులదీప్ యాదవ్ కూడా చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సమయంలో గనుక దూకుడుకు వెళితే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యేవాడు. అందువల్లే వికెట్ ను కాపాడుకుంటూ …. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ సిసలైన సమయమనాన్ని విరాట్ కోహ్లీ పాటించాడు. అంతేకాదు మరో ఆటగాడు కృణాల్ పాండ్యాతో కలిసి నాలుగో వికెట్ కు సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ దశలోని కృణాల్ పాండ్యాకు అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చి.. అతడు వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించేలా చేశాడు. మొత్తంగా అతను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.. విరాట్ కోహ్లీ ఇచ్చిన ధైర్యంతోనే అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఇదే విషయాన్ని పాండ్యా కూడా విలేకరుల ముందు వెల్లడించాడు.
Also Read: ఢిల్లీని పక్కనపెట్టిన ముంబై.. ఆ ఒక్క అడుగు వేస్తే పాయింట్ల పట్టికలో
ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకు
బెంగళూరు జట్టును గెలిపించినప్పటికీ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగడం లేదు. విరాట్ కోహ్లీ మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 51 రన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు చెన్నై ఆటగాడు విజయ్ శంకర్ 43 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడానికి 45 బంతులు అవసరం కావడంతో.. సోషల్ మీడియాలో విమర్శలు పెరిగిపోతున్నాయి. విరాట్ కోహ్లీ విజయ్ శంకర్ స్థాయికి దిగజారి పోయాడని.. అతడు కేవలం సొంతమైదానంలో వ్యక్తిగత రికార్డును కాపాడుకునేందుకే బ్యాటింగ్ చేశాడని.. కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో విరాట్ అభిమానులు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు.. “జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటమే అసలైన ఆటగాడి లక్ష్యం.. అది విరాట్ కోహ్లీకి తెలుసు కాబట్టి ఇలా ఆడాడు. ఏమాత్రం స్పృహ లేని వెర్రి వాళ్లు ఇలా ట్రోలింగ్ చేస్తున్నారంటూ” విరాట్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: మూడింటిలోనూ.. బెంగళూరు “లయన్ రోర్”.. ఐపీఎల్ లో ఇదో సంచలన రికార్డు!
Slowest 50s in IPL 2025
1. Virat Kohli in 45 balls
2. Vijay Shankar in 43 ballspic.twitter.com/Ded8CE80iu— Surya (@MsdianDhfm) April 27, 2025