Kolkata Knight Riders : ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై దూకుడు కొనసాగించింది. బౌలింగ్లో చుక్కలు చూపించింది. బ్యాటింగ్లో అదరగొట్టింది. మొత్తంగా చాంపియన్ అయింది. కానీ ఈ సీజన్లో మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. బలమైన బ్యాటింగ్ లైనప్.. దుర్భేద్యమైన బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ కోల్ కతా అదరగొట్టలేకపోయింది. అనామక జట్టు మాదిరిగా ఆడింది. కొన్ని విజయాలు సాధించినప్పటికీ.. కీలక దశలో విఫలం కావడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆడే తదుపరి మ్యాచ్లలో విజయం సాధించాలి. అంతేకాదు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. అప్పుడే ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది..
Also Read : మరో కప్ కోసం ఇప్పటినుంచే కోల్ కతా ప్లానింగ్.. కీలక ఆటగాడి పై వేటు..!
కీలక ప్లేయర్ దూరమయ్యాడు
గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును సరైన దారిలో నడిపించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అతని ఆధ్వర్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అప్రతిహత విజయాలు సాధించింది. ఏకంగా చాంపియన్ అయింది. ఫైనల్ మ్యాచ్లో అయ్యర్ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మైదానంలో అతడు రచించిన ప్రణాళికలు.. పన్నిన వ్యూహాలలో హైదరాబాద్ ఆటగాళ్లు చిక్కి విలవిలాడిపోయారు. అయితే కప్ అందించాడు అనే సోయి కూడా లేకుండా.. కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం అతడిని దూరం పెట్టుకుంది. మెగా వేలంలో అయ్యర్ ను రిటైన్ చేసుకోలేకపోయింది. దీంతో ఇదే అవకాశం గా పంజాబ్ జట్టు అయ్యర్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా పంజాబ్ జట్టు ఐపిఎల్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా దూకుడుగా ఆడుతోంది. ఏకంగా ప్లే ఆఫ్ రేసుమందు నిలిచింది. మరొక మ్యాచ్ గెలిస్తే చాలు పంజాబ్ అఫీషియల్ గా ప్లే ఆఫ్ వెళ్లిపోయినట్టే. కానీ అయ్యర్ ను దూరం చేసుకుని దాని ఫలితాన్ని కోల్ కతా జట్టు అనుభవిస్తోంది. ఆటగాళ్ల రొటేషన్.. సరైన సమయంలో ప్రణాళికలను రహనే అమలు చేయలేకపోవడంతో కోల్ కతా జట్టు డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడలేక పోతోంది. అసలు ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోయిన కోల్ కతా.. తన దురదృష్టాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంది. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం.. ఆటగాళ్ల వైఫల్యం.. అంతిమంగా కోల్ కతా జట్టు జట్టు పుట్టి ముంచాయి. గత సీజన్లో విజేతగా నిలిచిన తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం వాపును బలుపు అనుకుంది.. కానీ బలుపు, వాపు వేరు అని ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆ జట్టు మేనేజ్మెంట్ కు అర్థమయ్యేలా వివరిస్తోంది.
Also Read : ఓడిపోయినా సరే తగ్గేదేలే.. దంచి కొట్టుడే అంటున్న ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్