Rishabh Pant గత సీజన్ లో ఢిల్లీ జట్టును పంత్ సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. దీంతో ఈసారి ఢిల్లీ జట్టు పంత్ నే కెప్టెన్ గా కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. రిటైన్ చేసుకుంటుందని ఊహించారు. కానీ జరిగింది వేరు. రిటర్న్ జాబితాలో ఢిల్లీ జట్టు పంత్ పేరు ను ప్రస్తావించలేదు. దీంతో పంప్ బయటికి రావడం ఖాయం అయింది. పంత్ వేలంలోకి వస్తాడు కాబట్టి.. పంజాబ్, చెన్నై, బెంగళూరు జట్లు అతడికి భారీ మొత్తం చెల్లించి దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సంచలన విషయాలను వెల్లడించాడు. ” పంత్ తో ఢిల్లీ జట్టుకు విభేదాలు తలెత్తి ఉండవచ్చని” స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నాడు. అయితే దీనిపై ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ” ఢిల్లీ జట్టును విడిపోవడానికి డబ్బుతో సంబంధం లేదు. నా రిటెన్షన్ అంశానికి, డబ్బుతో ముడిపడి లేదు. దానితో నేను కచ్చితంగా ఏకీభవిస్తానని” పంత్ వ్యాఖ్యానించాడు..
ఢిల్లీ జట్టు కొనుగోలు చేస్తోందట..
పంత్ విలువ తెలుసు కాబట్టి ఢిల్లీ జట్టు మళ్లీ కొనుగోలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. “ఢిల్లీ జట్టు రిషబ్ పంత్ ను తీసుకుంటుంది. కొన్ని సందర్భాలలో ఒక ఆటగాడిని కొనసాగించాలి అనుకున్నప్పుడు ఫీజుల గురించి చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు ఆటగాడు, జట్ల మధ్య ఈ ప్రస్తావన వస్తుంది. రిటైన్ అయిన ఆటగాళ్లలో కొంతమందికి ఆయా జట్ల యాజమాన్యాలు మొదట రిటెన్షన్ ఫీజు కంటే ఎక్కువగానే చెల్లించాయి. ఈ లెక్కన చూసుకుంటే ఢిల్లీ జట్టు కూడా పంత్ ను తిరిగి తీసుకుంటుంది. అంచనాలకు మించిన ఫీజు ఇస్తుంది. ఇందులో ఎటువంటి అవమానాలు లేవు. ఢిల్లీ జట్టుకు ప్రస్తావ ఒక నాయకుడు కావాలి. ఒకవేళ పంత్ ప్రస్తుతం జట్టులో లేకపోతే కొత్త కెప్టెన్ వారికి అవసరం అవుతుంది. అలాంటి అన్వేషణ చేసే కంటే.. ఉన్న పంత్ ను కాపాడుకుంటే బాగుంటుందనే ఆలోచన ఢిల్లీ జట్టు చేస్తుందని” గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ అభిమానులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. వచ్చే ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు సాధించాలంటే కచ్చితంగా జట్టులో పంత్ ఉండాలని.. అతని నాయకత్వంలో జట్టు సమర్థవంతంగా అడుగులు వేస్తుందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.. పంత్ ఇటీవల అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న తీరును వారు ఉదహరిస్తున్నారు.