Pushpa 2 Movie : అల్లు అర్జున్ సినిమా విడుదల అవుతుంది అంటే మెగా అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లతో సమానంగా అల్లు అర్జున్ సినిమాలను కూడా చూసేవారు. కానీ ఈమధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య తీవ్రమైన విబేధాలు ఏర్పడ్డాయి. క్షేత్ర స్థాయిలో కూడా ఇలాంటి విబేధాలు ఉంటాయా అంటే చెప్పలేము కానీ, సోషల్ మీడియా లో మాత్రం ఇరువురి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ కి సపోర్టుగా సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా వైసీపీ ఫ్యాన్స్ సపోర్టు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఎందుకంటే ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లి సపోర్టు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ పై విరుచుకుపడడం మొదలు పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గొడవలు అలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యే కి సపోర్టుగా వచ్చిన అల్లు అర్జున్ కి కృతజ్ఞతగా వైసీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో పుష్ప 2 చిత్రాన్ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న విడుదలైన ట్రైలర్ లోని ఒక డైలాగ్ ని, తమ ప్రియతమ నాయకుడు జగన్ ఒక సందర్భంగా మాట్లాడిన మాటలకు కలుపుతూ ఒక అద్భుతమైన ఎడిటెడ్ వీడియో ని అప్లోడ్ చేసాడు. ఇది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ ‘నాకు కావల్సినది ఏడు కొండల మీద ఉన్నా..7 సముద్రాల దాటి ఉన్నా..పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి స్టైల్’ అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. వైసీపీ కార్యకర్తలను ఇటీవల అరెస్ట్ చేస్తున్నప్పుడు జగన్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఇదే ఇలాంటి డైలాగ్ నే కొడుతాడు. ‘మేము అధికారం లోకి రాగానే, మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు 7 సముద్రాల అవతల దాగి ఉన్నా పట్టుకొచ్చి అరెస్ట్ చేయిస్తాం’ అంటూ ఒక వార్నింగ్ ఇస్తాడు. ఈ రెండు డైలాగ్స్ ని క్లబ్ చేసి, జగన్ ని అల్లు అర్జున్ ని కలుపుతూ వైసీపీ అభిమానులు చేసిన వీడియో ని మీరు కూడా చూసేయండి. సోషల్ మీడియా లో సపోర్టు చేసినట్టుగానే, బయట కూడా వైసీపీ అభిమానులు ‘పుష్ప 2 ‘ ని సపోర్టు చేస్తారా లేదా అనేది చూడాలి.
పుష్ప-2లో జగనన్న డైలాగ్.. జస్ట్ ఒక్క పదం మార్చారంతే #YSJagan #Pushpa2 #AlluArjun #YSRCP #YSJaganTimes pic.twitter.com/T0aGN4o6kx
— YS Jagan Times (@YSJaganTimes) November 18, 2024