Team India: టీమిండియా అత్యంత చెత్త రికార్డ్ ఇదే…

ఇక ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన ఇండియన్ టీమ్ రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చాలా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒక చెత్త రికార్డును కూడా ఇండియన్ టీమ్ తన ఖాతాలో వేసుకుంది.

Written By: Gopi, Updated On : January 29, 2024 2:34 pm
Follow us on

Team India: ఇండియా స్వదేశంలో మ్యాచులు ఆడిందంటే దాదాపుగా అన్ని మ్యాచ్ లను గెలిచి తీరుతుంది.ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ ల్లో అయితే ఇండియన్ టీమ్ కి చాలా మంచి రికార్డ్ ఉంది. ఇక ఇదే రికార్డ్ ని కంటిన్యూ చేస్తూ ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నప్పటికీ, ఇంగ్లాండ్ మాత్రం ఇండియన్ టీం కి భారీ షాక్ అయితే ఇచ్చింది.

ఇక ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన ఇండియన్ టీమ్ రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చాలా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒక చెత్త రికార్డును కూడా ఇండియన్ టీమ్ తన ఖాతాలో వేసుకుంది. మనదేశంలో ఆడిన అన్ని టెస్ట్ మ్యాచ్ ల్లో మొదటి ఇన్నింగ్స్ లో 100 కంటే ఎక్కువ పరుగుల ఆధిక్యం సాధించి కూడా ఇండియా ఓడిపోవడం ఇదే మొదటిసారి…

ఇక ఇప్పటి వరకు ఇండియా మొత్తం 106 మ్యాచ్ ల్లో 100 కంటే ఎక్కువ రన్స్ లీడింగ్ లో ఉన్నప్పటికీ అందులో 70 మ్యాచ్ ల్లో విజయం సాధించింది, ఇక 35 మ్యాచ్ లను డ్రా గా ముగించింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి తొలిసారి ఓటమిని చవి చూసిన టీమ్ గా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ పైన కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ మా బ్యాట్స్ మెన్స్ ఫెయిల్ అవ్వడం వల్లే మేము ఈ మ్యాచ్ లో ఓటమి పాలయ్యము.

నెక్స్ట్ మ్యాచ్ లో ఇలాంటి మిస్టేక్స్ ఏమి లేకుండా భారీ విజయాన్ని సాధించి ఈ సిరీస్ ని కైవసం చేసుకోవడానికి మా స్వాయ శక్తుల పోరాటం చేస్తాం అంటూ మాట్లాడాడు…ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో కనక ఇండియన్ టీమ్ ఓడిపోతే ఇంగ్లాండ్ టీమ్ ఈ కప్పు ను ఎగేరేసుకుపోతుంది. ఇక అదే జరిగితే ఇండియా పరువు పోవడంతో పాటు గా డబ్ల్యూటీసి ఫైనల్ కి కూడా ఇండియన్ టీమ్ అర్హత సాధించడం కష్టం అవుతుంది…