Chiranjeevi-Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నప్పుడే సినిమాలను వదిలేసి ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టీ రాజకీయంగా ఎదగాలని చూశాడు. కానీ అక్కడ చిరంజీవికి కొంచెం గడ్డు పరిస్థితులు ఎదురవడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసాడు. ఇక రీ ఎంట్రీ లో అదిరిపోయే విజయాలను అందుకుంటూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఇప్పుడున్న యంగ్ హీరోలకి కూడా పోటీ ఇస్తు వస్తున్నాడు.ఇక చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని చిరంజీవితో సంబంధం లేకుండా ఇండివిజ్యువల్ గా ఇండస్ట్రీలో ఎదిగాడు. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ప్రస్తుతం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ని పోల్చుతూ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటూ కొన్ని విచిత్రమైన ప్రశ్నలను అడుగుతున్నారు.
ఇక దానికి కొంతమంది ఇద్దరికీ సేమ్ ఇమేజ్ ఉందని సమాధానం చెప్తుంటే, మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎక్కువ క్రేజ్ ఉందంటూ సమాధానం చెబుతున్నారు. నిజానికి ఒకప్పుడు చిరంజీవికి భారీ పాపులారిటీ ఉండేది, కానీ ఇప్పుడు అతను 70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాడు.ఇక ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసింది.అలాగే అభిమానుల తాలూకు అభిరుచులు అనేవి మారిపోతూ ఉంటాయి.ఇక 80స్, 90స్ లో ఉన్న వాళ్ళకైతే ఇప్పటికి చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది.కానీ 2000 తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు.
మొత్తానికైతే చిరు అభిమానులు అయిన, పవన్ అభిమానులు అయిన ఇద్దరు మెగా ఫ్యామిలీ అభిమానులే కావడం విశేషం…మొత్తానికైతే ఇద్దరికీ సమానమైన ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకరకంగా చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అభిమానులు ఉన్నా కూడా చిరంజీవి ఏమాత్రం ఇబ్బంది పడడు. ఎందుకంటే చిరంజీవి దగ్గరుండి పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. పవన్ కళ్యాణ్ ఎదుగుదలని చూసి సంతోషపడే వాళ్లలో చిరంజీవి మొదటి వాడు. పవన్ కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానని చిరంజీవి చాలాసార్లు చెప్పాడు…ఇక పవన్ కళ్యాణ్ అయితే చిరంజీవి తో తనని పోల్చడానికి కూడా ఇష్టపడడు, ఎందుకంటే పవన్ కి అన్నయ్య అంటే దైవం. అన్నయ్యే అన్ని అని నమ్ముతాడు కాబట్టే చిరంజీవే తనకు సర్వం…