India vs England 3rd Test: ఇండియా ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్ వేదికగా ఇవాళ్ల మూడోవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక అందులో భాగంగానే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియన్ టీం ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలను పెట్టుకొని బరిలోకి దిగుతుంది. ఇక ఇప్పటికే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో రెండు టీంలు చెరొక విజయాన్ని అందుకొని 1-1 తో సమానంగా ఉండగా, మూడో టెస్ట్ మ్యాచ్ గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఇండియన్ టీం, ఇంగ్లాండ్ టీం రెండు కూడా తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ రెండు టీముల పరిస్థితి ఎలా ఉన్నా కూడా, గెలుపు ఒకటే ధ్యేయం గా ముందుకు కదులుతున్నాయి. ఇక అందులో భాగంగానే ఇండియన్ టీం ఈ మ్యాచ్ కోసం భారీ మార్పులు చేర్పులు చేసింది. కొత్త ప్లేయర్లందరికి ఈ మ్యాచ్ లో అవకాశం కల్పిస్తూ ఒక రకంగా ప్రయోగం చేస్తూనే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది. మరి కొత్త ప్లేయర్లు తమ సత్తాని చాటుకొని ఇండియన్ టీం ని విజయ తీరాలకు చేరుస్తారా, లేదా అనేది కూడా ఇప్పుడు చర్చ నీయాంశం గా మారింది. ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ప్లేయర్లు ఉన్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
యశస్వి జైష్వాల్, రోహిత్ శర్మ, రజత్ పటిదర్, శుభమన్ గిల్ , సర్ఫా రాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, దృవ్ జురుల్, అశ్విన్, కుల్దిప్ యాదవ్, బుమ్రా, సిరాజ్
ఇక ఇంగ్లాండ్ ప్లేయర్లను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే…
క్రాలి, డకెట్, పోప్,రూట్, బెయిర్ స్టో, స్టోక్స్, ఫోక్స్, రేహన్ అహ్మద్,టామ్ హార్ట్ లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్…
ఇక ఈ రెండు టీంలు కూడా డూ ఆర్ డై మ్యాచ్ లను ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి సిరీస్ ను గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది…