IPL 2024: ఐపీఎల్ కు గ్లామర్ తెచ్చిందే వీళ్ళు..

కావ్య కంటే ముందు హైదరాబాద్ జట్టుకు దక్కన్ గ్రూపు ప్రాతినిధ్యం వహించేది. అప్పట్లో ఆ జట్టును దక్కన్ చార్జర్స్ గా పిలిచేవారు. ఆ జట్టుకు గాయత్రి రెడ్డి ఓనర్ గా ఉండేది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 8:44 am

IPL 2024

Follow us on

IPL 2024: ఆటకు అందం తోడైతే ఆ లెక్క వేరే విధంగా ఉంటుంది. అది ప్రేక్షకులకు అత్యంత సులభంగా చేరువవుతుంది. ఇక ఆ తర్వాత దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు 16 సీజన్లు అద్భుతంగా సాగాయి. 17వ సీజన్ కూడా అలానే కొనసాగుతోంది. మరి ఐపీఎల్ ఇంతటి స్థాయిలో విజయవంతం కావడానికి బీసీసీఐ చేసిన ప్రయత్నాలు కారణం ఒకటైతే.. దానికి గ్లామర్ అద్దడం మరొకటి. ఇక్కడ గ్లామర్ అంటే చీర్ గర్ల్స్ కాదు.. వాస్తవానికి చీర గర్ల్స్ వల్ల ఐపీఎల్ కు ఆశించినంత స్థాయిలో లాభం జరగలేదని ఆరోపణలు గతంలో వినిపించాయి. అయితే ఐపీఎల్ ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కొంతమంది పరోక్షంగా కారణమయ్యారు. ఆటకు అందాన్ని అద్ది.. ప్రేక్షకులను అలరించారు. మైదానాలకు రప్పించారు.

ప్రస్తుతం హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడితే కెమెరామెన్లు తమ ఫోకస్ మొత్తం ఆ జట్టు యజమాని కావ్య మారన్ వైపే మళ్లిస్తారు. హైదరాబాద్ జట్టు ఆడుతుంటే కావ్య హావాభావాలు భలే ఉంటాయి. ఆ జట్టు ఆటగాళ్లు సిక్స్ కొడితే ఎగిరి గంతేస్తుంది. ఫోర్ కొడితే డ్యాన్స్ వేస్తుంది. అదే అవుట్ అయితే బాధపడుతుంది. మ్యాచ్ ఓడిపోతే నిర్వేదానికి గురవుతుంది. అంటే ఒక మనిషి లో ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే.. అవి కూడా జెన్యూన్ గా ఉన్నాయి కాబట్టే.. కావ్య వార్తల్లో వ్యక్తి అవుతోంది. కెమెరామెన్ లకు చేతినిండా పని చెబుతోంది. హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్ లలో కేవలం కావ్యను చూసేందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పైగా మైదానంలో కావ్య చేసే సందడి అంతా ఇంతా కాదు.

గాయత్రి రెడ్డి

కావ్య కంటే ముందు హైదరాబాద్ జట్టుకు దక్కన్ గ్రూపు ప్రాతినిధ్యం వహించేది. అప్పట్లో ఆ జట్టును దక్కన్ చార్జర్స్ గా పిలిచేవారు. ఆ జట్టుకు గాయత్రి రెడ్డి ఓనర్ గా ఉండేది. అప్పట్లో ఆమె దక్కన్ చార్జర్స్ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ కు హాజరయ్యేది.. తన అంద చందాలతో అలరించేది. ఆమెను చూసేందుకే ప్రేక్షకులు మైదానానికి వచ్చేవారు. గాయత్రి రెడ్డి బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉండడంతో చాలామంది అందానికి ఫిదా అయ్యేవారు. అప్పట్లో సోషల్ మీడియా అంతగా ఫేమస్ కాకపోయినప్పటికీ.. గాయత్రి రెడ్డి ఫోటోలు ప్రింట్ మీడియాలో ప్రచురితం అవుతూనే ఉండేవి. టీవీల్లో ఆమె సందడి చేసిన దృశ్యాలు టెలికాస్ట్ అవుతూనే ఉండేవి. ఫేస్ బుక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గాయత్రి రెడ్డి మరింత ఫేమస్ అయ్యారు. గాయత్రి రెడ్డి మరెవరో కాదు దక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ అధినేత వెంకట్రామిరెడ్డి కూతురు. ఇక దక్కన్ చార్జర్స్ జట్టు 2009లో ఐపీఎల్ కప్ గెలుచుకుంది. 2008 నుంచి 2010 వరకు రోహిత్ శర్మ దక్కన్ చార్జర్స్ జట్టుకే ఆడాడు.

ప్రీతిజింతా

మొదట్లో ఈమె పంజాబ్ జట్టుకు సహా అధిపతిగా ఉండేది. జట్టు గెలిచినప్పుడల్లా ఎగిరి గంతేసేది. మ్యాచ్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ముద్దులు కూడా ఇచ్చేది. అప్పట్లో ఆమె ఇచ్చిన ముద్దులు మీడియాలో హైలెట్ అయ్యేవి. కొందరు ఆటగాళ్లు ఆమె ముద్దుల కోసమే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడేవారు. మరోవైపు ప్రీతిజింతా కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది కాబట్టి.. ఆమెను చూసేందుకే ప్రేక్షకులు మైదానానికి వచ్చేవారు.

నీతా అంబానీ

ముంబై ఇండియన్స్ జట్టు అధిపతిగా నీతా అంబానీ సుపరిచితురాలే. ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో జట్టు ఆటగాళ్లను నీతా అభినందించేవారు. దేశంలోనే అత్యంత ధనికుడైన భర్తకు భార్య అయినప్పటికీ.. మైదానంలో ఆమె ఆ తాలూకు దర్పాన్ని ప్రదర్శించేవారు కాదు. పైగా మ్యాచ్ గెలిస్తే ఆటగాళ్లతో సంబరాలు చేసుకునేవారు. వారితో కలివిడిగా ఉండేవారు. నీతా అంబానీ కూడా ఐపీఎల్ కు గ్లామర్ తెచ్చిన వారిలో ఒకరు.