Nothing Phone 4a: 2026 సంవత్సరంలో కొత్త మొబైల్స్ మార్కెట్ లోకి వెలువలా వస్తున్నాయి. వినియోగదారులు లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన మొబైల్ కోరుకోవడం తో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఫ్లాగ్ ఫిష్ వంటి ఫీచర్లను చేస్తూ మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా Nothing (4a), Nothing (4a pro) అనే మొబైల్స్ ఎలాంటి ప్రచారం లేకుండా నేరుగా మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో కొత్త గ్లిప్ బార్, పెరిస్కోప్ ఉండడంతో ఆసక్తిగా చర్చ సాగుతోంది. అంతేకాకుండా మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా ధర ఉండడంతో ఈ మొబైల్స్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
నథింగ్ (4a) మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీనిపై గొరిల్లా గ్లాస్ 7i రక్షణగా ఉండనుంది. ఇందులో 7s Gen 4 చిప్ సెట్ ఉండడంతో అద్భుతమైన వేగంతో పని చేస్తుందని అంటున్నారు. ఈ మొబైల్లో LPDD R4x Ram తో పాటు UFS 3.1 స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫొటోస్, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో 5400 mAh బ్యాటరీ ఉండగా ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. ఇందులో హై డెఫినిషన్ మైక్ తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఏఐ ఫీచర్స్ ఉండడంతో గేమింగ్ కోరుకునే వారికి సపోర్ట్ గా ఉండనుంది.
ఈ మొబైల్లో కొత్తగా గ్లిప్ బార్ అమర్చారు. ఇది 6 LED, 63 మినీ నిలువు LED ఉండనుంది. దీంతో నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఈ గ్లిప్ బార్ వెలిగిపోతూ ఉంటుంది. అలాగే షెడ్యూల్ కోసం కెమెరా కోసం ఇవి పనిచేస్తాయి. జనరేటివ్ రింగ్ టోన్స్, నోటిఫికేషన్ సౌండ్స్ కూడా ఇందులో చూడొచ్చు..అలాగే ఈ మొబైల్ లో పెరిస్కోప్ కొత్తగా ప్రవేశపెట్టారు. ఇది 50 MP తో పని చేస్తుంది. అలాగే 70 x అల్ట్రా జూమ్ తో ఉండడంవల్ల లాంగ్ షార్ట్ ఫోటోలను కూడా క్లియర్ గా తీసుకోవచ్చు.
ఇక నథింగ్ (4a) ప్రో మొబైల్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇది స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా చూడొచ్చు. ఈ కెమెరా 3.5 x జూమ్ చేసినా కూడా ఎలాంటి resolution తగ్గదు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేస్తుంది.32 MP సెల్ఫీ తోపాటు వీడియో కాలింగ్ కోసం పనిచేయనుంది. నథింగ్ (4a) ప్రో మొబైల్ లో 5400 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 50 W ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. ఇందులో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
నథింగ్ (4a) మొబైల్ 8gb రామ్ 12gb స్టోరేజ్ తో కావాలంటే రూ.31,999 తో కొనుగోలు చేయవచ్చు. అలాగే నథింగ్ (4a) ప్రో మొబైల్ ఇదే కాన్ఫిగరేషన్తో రూ.39,999 తో పొందవచ్చు. కాన్ఫిగరేషన్ పెంచుకోవాలనుకుంటే ధర పెరుగుతుంది.