Homeక్రీడలుక్రికెట్‌Team India victory: ఫైనల్ చేరినా..ఇది టీమిండియా స్థాయి గెలుపు కాదు.. పోస్టు మార్టం జరగాల్సిందే!

Team India victory: ఫైనల్ చేరినా..ఇది టీమిండియా స్థాయి గెలుపు కాదు.. పోస్టు మార్టం జరగాల్సిందే!

Team India victory: టీమ్ ఇండియా ఫైనల్ వెళ్ళింది. 2024 తర్వాత వరుసగా 2026వ సీజన్లో కూడా టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా ఫైనల్ చేరడం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో పోటీపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా వరుసగా రెండవసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది…

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆట తీరు గొప్పగా లేదు. సెమీ ఫైనల్ లో టీమిండియా తన స్థాయి తగ్గట్టుగా ఆడలేదు. బ్యాటింగ్లో సంజు శాంసన్ దూకుడు వల్ల టీమిండియా ఆస్థాయి స్కోర్ చేయగలిగింది. అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ మధ్యలోనే అవుట్ అయినప్పటికీ.. సంజు శాంసన్ నిలబడ్డాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అందువల్ల టీమిండియా ఏకంగా 253 పరుగులు చేసింది.

T20 లో 253 పరుగులు అంటే మామూలు విషయం కాదు. అయితే ఇంగ్లాండ్ జట్టు టకాటకా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ బెతల్, విల్ జాక్స్ అడ్డుగోడ మాదిరిగా నిలిచారు. టీమిండియా కు ఊహించని ఓటమి అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేయడంతో ఇంగ్లాండ్ జట్టు ఆటలు సాగలేదు. వాస్తవానికి బుమ్రా మినహా మిగతా బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు . వరుణ్ చక్రవర్తి నాలుగో ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ 35 పరుగులు ఇచ్చాడు. దూబే ఒక ఓవర్ వేసి 22 పరుగులు ఇచ్చాడు.. అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 51 పరుగులు ఇచ్చాడు.

సెమీఫైనల్ లో బ్యాటింగ్ పరంగా టీమిండియా అద్భుతమైన ఆట తీరు చూపించింది. ముఖ్యంగా సంజు తన తిరుగులేని ఫామ్ కొనసాగించాడు. ఇంగ్లాండ్ బౌలర్ల మీద ఎదురుదాడికి దిగాడు. కానీ, బౌలింగ్లో టీమ్ ఇండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. విజయానికి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయిందంటే దానికి ప్రధాన కారణం భారత జట్టు బౌలింగ్ లోపమే. ఇదే లోపం గనుక ఫైనల్ లో కంటిన్యూ అయితే టీమిండియా కచ్చితంగా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టులో భీకరమైన అలెన్ ఉన్నాడు. అతడు ఏమాత్రం కనికరం చూపించకుండా బ్యాటింగ్ చేస్తాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అతడు ఏకంగా సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్లు తమ బౌలింగ్ తీరును మార్చుకోకపోతే.. ఫైనల్ మ్యాచ్లో భారీగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version