IPL Highest Runs: క్రికెట్ అభిమానుల క్రీడా పండుగ ప్రారంభమైంది. ఐపీఎల్ వేడుక నేడు ఆరంభమవుతోంది. దీంతో అభిమానులకు సంబరం కానుంది. తొలిమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చాంపియన్ కోల్ కత నైట రైడర్స్ తలపడనున్నాయి. దీంతో ఇప్పటివరకు అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లపై అందరి దృష్టి పడుతోంది. ఇందులో ఏ జట్టు విజయం సాధించి కప్ గెలుచుకుంటుందో తెలియడం లేదు. కానీ అన్ని జట్లు ఫేవరేట్ గానే బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులకు కనువిందు కానుంది.
ఐపీఎల్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సురేష్ రైనా మొదటి స్థానంలో నిలిచాడు. అన్ని మ్యాచుల్లో 610 పరుగులు చేశాడు. తరువాత మహేంద్ర సింగ్ ధోని 442 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఫాప్ డుప్లిసెస్ 423 పరుగులు సాదించాడు. నాలుగో స్థానంలో రాబిన్ ఊతప్ప 310 పురుగులు చేశాడు. దీంతో ఆటగాళ్ల సామర్థ్యంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

కోల్ కతకు ప్రాతినిధ్యం వహించిన మెకల్లమ్ 285 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరులో పాఫ్ డుప్లిసెస్ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో మన్వీందర్ బిస్లా ఉండటం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో ఐపీఎల్ పండుగను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈసారి రెండు జట్లు కొత్తగా చేరడంతో పోటీ రసవత్తరంగా మారనుందని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
Also Read: CM KCR: వడ్ల కొనుగోలుపై కేసీఆరే ఇంత పని చేశారా.. అప్పుడెందుకు నిరసన చేయలేదు సార్..
కోల్ కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 26 మ్యాచుల్లో పోటీపడినట్లు తెలుస్తోంది. చెన్నై 17, కోల్ కత 8 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఫైనల్ లో ఈ జట్లు రెండు సార్లు తలపడగా ఒకసారి కోల్ కత, మరో సారి చెన్నై గెలవడం తెలిసిందే. కానీ ఈ సారి ఏది ఆధిపత్యం చెలాయించి గెలుస్తాయో తెలియడం లేదు. మొత్తానికి క్రీడా పండుగ మాత్రం రంజుగా సాగనుందని తెలుస్తోంది. ఈ సీజన్ సంబరాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు మజాగా మారనున్నాయి.

Also Read: Mahesh Babu Tweets On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మహేష్ స్పందన.. వైరల్ అవుతున్న ట్వీట్స్ !