https://oktelugu.com/

NTR Thanks To Fans: మీ ప్రేమ, ప్రశంసలే నన్ను ముందుకు నడిపాయి – ఎన్టీఆర్

NTR Thanks To Fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించింది. మరోవైపు ఈ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. మీరు అందిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశాడు. మీ ప్రేమ, ప్రశంసలే తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పాడు. విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ను ఎంజాయ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 05:30 PM IST
    Follow us on

    NTR Thanks To Fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించింది. మరోవైపు ఈ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. మీరు అందిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశాడు. మీ ప్రేమ, ప్రశంసలే తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పాడు. విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ను ఎంజాయ్ చేయండని కోరాడు.

    ఏది ఏమైనా విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్ లలో విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.67 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.

    RRR

    తొలిరోజే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్‌ బ‌స్ట‌ర్ ‘బాహుబ‌లి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూసుకుంటే ఇప్పటివరకూ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం.అందుకే ఎన్టీఆర్ పై విధంగా తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇక చరణ్ ఫ్యాన్స్ కూడా మెగా హౌస్ దగ్గర భారీగా తరలి వచ్చారు.

    Also Read: Prakash Raj Statement: పునీత్‌ సేవల విషయంలో ప్రకాష్ రాజ్ కీలక ప్రకటన !

    ఇప్పటికే ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, రాలేకపోవడంతో ఈ సినిమాకి రానున్న రోజుల్లో కూడా భారీ కలెక్షన్లు రానున్నాయి. మరోపక్క మిగిలిన స్టార్ హీరోలు కూడా ఈ సినిమాని పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి ఈ చిత్రానికి ఫిదా అయిపోయాడు. అల్లు అర్జున్ తనదైన శైలిలో చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

    మహేష్ బాబు కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఒక E.P.I.C. ‘గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. అలాగే మ్యూజిక్, ఎమోషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కేవలం మాస్టర్ స్టోరీటెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. ఒక్క రాజమౌళి మాత్రమే ఇలా సినిమా తీయగలడు. సెన్సేషనల్ ఫిల్మ్ మేకింగ్‌లో రాజమౌళి మాస్టర్. తారక్, చరణ్ తమ స్టార్‌ డమ్‌ ను మించి గొప్పగా ఎదుగుతున్నారు అంటూ తన అభినందనలు తెలిపాడు మహేష్.

    Also Read: Shraddha Kapoor: ఆ స్టార్ హీరోయిన్ తన ప్రియుడిని వదిలేసింది

     

    Tags