Prakash Raj Statement: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను కలిచివేసింది. తోటి సినీ తారల మనసులను బాధతో కప్పేసింది. అసలు ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అనుకుంటే.. పునీత్ రాజ్ కుమార్ బతికిన విధానానికి ‘మనిషి జన్మ’ సంతోషంతో ఎగిరి గంతేస్తోంది. 45 స్కూళ్లు.. 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్.. 19 గోశాలలకు సాయం.. చివరకు చనిపోయినా రెండు కళ్లూ దానం చేసిన మహోన్నతమైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అయితే, పునీత్ చనిపోయాడు, మరి ఇప్పుడు పునీత్ చేసిన ఈ సేవలన్నీ ఆగిపోతాయి అని ఇన్నాళ్లు చాలామంది భయపడ్డారు.
అయితే, ఆ భయం ఇక లేదు అని ముందుకు వచ్చాడు ప్రకాష్ రాజ్. తన పుట్టినరోజు సందర్భంగా ప్రకాశ్‌రాజ్ కీలక ప్రకటన చేస్తూ.. ‘దివంగత పునీత్ రాజ్‌కుమార్ (అప్పు) “సేవలను ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆయన తెలియజేశారు. అలాగే ఈ ప్రకటనకు సంబంధించిన సంబంధిత వివరాలు త్వరలోనే పంచుకుంటాను అని ఆయన తెలిపారు.
Also Read: Mahesh Babu Tweets On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మహేష్ స్పందన.. వైరల్ అవుతున్న ట్వీట్స్ !
ఈ మేరకు పునీత్ రాజ్ కుమార్ ఫోటోతో కూడిన పోస్టర్ ను కూడా ప్రకాష్ రాజ్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో ‘అప్పూ ఎక్స్‌ప్రెస్ అని రాసి ఉంది. ఈ పోస్ట్ పై ఇప్పటికే పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కామెంట్ల రూపంలో ప్రకాష్ రాజ్ ను అభినందించారు. ఏది ఏమైనా తన ఫౌండేషన్ ద్వారా ప్రకాశ్ రాజ్ లాక్‌డౌన్ లో కూడా ఎంతోమందికి సాయం చేశాడు. పైగా తన ఫామ్ హౌస్ లో ఆశ్రయం ఇచ్చాడు.
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. ప్రకాష్ రాజ్ ఇలా “సేవా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయడం అభినందనీయం. అన్నట్టు ఈ రోజు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా.. శనివారం షాద్‌నగర్ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రొత్సహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రకాష్ రాజ్ అభినందించారు. గ్లోబల్ వార్మింగ్ అరికట్టేందుకు.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Also Read: Salman Khan- Megastar Chiranjeevi: సల్మాన్ తో చిరు షూట్ పూర్తయింది.. పాత్ర అదే