Homeఆధ్యాత్మికంToday 8 March 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు ధనయోగం.. పెట్టుబడులకు...

Today 8 March 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు ధనయోగం.. పెట్టుబడులకు ఇదే మంచి సమయం..

Today 8 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాశిలపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో గ్రహాల అనుకూలత ఉండడంతో కొన్ని రాశుల వారికి సానుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,p): ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అయితే వ్యాపారులు కొత్త భాగస్వాములతో ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబార ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనువైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనవసరపు వాదనలకు దూరంగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరుపకూడదు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఇతరుల సహాయం తీసుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. గ్రహాల అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దలను సంప్రదించాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు. అయితే కొందరి ప్రవర్తన వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కీలకమైన పనుల్లో పాల్గొంటారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రాజకీయాల్లో ఉండే వారికి కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఏదైనా పనులు ప్రారంభిస్తే వాటిని వెంటనే పూర్తి చేస్తారు. పెట్టుబడుల విషయంలో పెద్దలను సంప్రదిస్తారు. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలను పరిగణలోకి తీసుకోవాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఓపికతో ఉండడం మంచిది. వ్యాపారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రియమైన వారికి వస్తువులు కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెద్దల అండదండలతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు సానుకూలమైన వాతావరణము ఉంటుంది. అధికారుల అండదండలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. తెలివితేటలు ప్రదర్శించడం వల్ల ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి పెద్దల అండదండలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version