IPL 2024: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ప్రతి టీం కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇస్తు ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ప్రేక్షకులను మ్యాచులు అలరిస్తున్నాయి. ఇక ఇవే కాకుండా మ్యాచ్ మధ్యలో వచ్చే ప్రకటనలకు కూడా భారీ రేంజ్ లో క్రేజ్ అయితే దక్కుతుంది. TAM స్పోర్ట్స్ నివేదిక ప్రకారం ఐపీఎల్ 17 లో మ్యాచ్ లు చూసే సమయంలో టెలివిజన్ లో వచ్చే ప్రకటనల వాల్యూమ్ అనేది గణనీయంగా పెరిగిందనే చెప్పాలి.
ఇక గత సంవత్సరం తో పోల్చితే ఈ సీజన్ లో ఆడిన మొదటి 23 మ్యాచ్ ల్లో ఒక్కో ఛానెల్ కు 6% ప్రకటనల వాల్యూ అనేది పెరిగింది… ఇక ఐపిఎల్ 16 తో పోలిస్తే ఆయా కేటగిరీలు 65% పెరుగగా, ప్రకటనదారులు 37% పెరిగినట్టుగా తెలుస్తుంది…ఇక కేటగిరీల్లో ఐపిఎల్ 17 లో పార్లే ఉత్పత్తుల ప్రకటనలు అలాగే పాన్ మసాలా బ్రాండ్స్ కూడా 7 మ్యాచ్ ల్లో ముందు వరుస లో ఉన్నాయి…
విష్ణు ప్యాకేజింగ్, కేపి పాన్ ఫుడ్స్ కూడా కొన్ని మ్యాచ్ లో ముందు వరుసకి వచ్చాయి. ఇక గత సీజన్ తో పోలిస్తే ఈసారి ఐపీఎల్ లో 86 కొత్త బ్రాండ్స్ వచ్చాయి…ఇక ఈ కొత్త బ్రాండ్ లలో పార్లే ఫుడ్ ప్రొడక్ట్స్ అలాగే ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్ మొదటి రెండు స్థానాలను పొందాయి…ఇక ఐపీఎల్ అనేది చాలామందికి వినోదాన్ని అందిస్తుంటే, మరి కొంతమందికి మాత్రం బిజినెస్ ల రూపంలో భారీ మొత్తంలో డబ్బులను తీసుకు వచ్చి పెడుతుందనే చెప్పాలి.
ఇక ఆయా మ్యాచులు టెలికాస్ట్ అయ్యే సమయంలో వాటి స్లాట్స్ కోసం భారీ మొత్తం లో చెల్లించే బ్రాండ్స్ ఉండడం విశేషం…ఒక్కో మ్యాచ్ ను బట్టి ఆ స్లాట్ కి డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దానికోసం ఆయా కంపెనీలు లక్షల్లో చెల్లిస్తున్నాయనే చెప్పాలి…ఇక ఒకరకంగా సామాన్య మానవుడికి ఐపిఎల్ ఒక వినోదం అయితే కంపేనీ లకు మాత్రం అది భారీ వ్యాపారం…