https://oktelugu.com/

Maruthi Swift : బెస్ట్ ఫీచర్స్ తో రానున్న కొత్త స్విప్ట్.. ధర ఎంతో తెలుసా?

కొత్త స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ జడ్ సిరీజ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో పవర్ ట్రెయిన్ సౌకర్యం ఉంటుంది. ఇప్పుడున్న స్విప్ట్ కె 12 ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీని స్థానంలో జడ్ సిరీస్ ను ప్రవేశపెట్టారు. దీంతో ఇది 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ గా అవతారమెత్తింది. 9

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2024 2:01 pm
    Maruti Swift 2024

    Maruti Swift 2024

    Follow us on

    Maruthi Swift :  మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన మోస్ట్ పాపులర్ కారు స్విప్ట్. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంది. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా స్విప్ట్ ను కొత్త తరహాలో తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న దానిలో కొన్ని మార్పులు చేసి, భద్రతా ఫీచర్లను అప్డేట్ చేశారు. ఇప్పటికే దీనిని జపాన్ లోని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షో లో ప్రదర్శించారు. దీంతో ఈ మోడల్ ను చూసిన వినియోగదారులు కారు కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ కారు లేటేస్ట్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    కొత్త స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ జడ్ సిరీజ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో పవర్ ట్రెయిన్ సౌకర్యం ఉంటుంది. ఇప్పుడున్న స్విప్ట్ కె 12 ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీని స్థానంలో జడ్ సిరీస్ ను ప్రవేశపెట్టారు. దీంతో ఇది 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ గా అవతారమెత్తింది. 90 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గురించి వివరాలు వెల్లడించలేదు. కానీ ఇది సీఎన్ జీ వేరియంట్ తో కూడా పనిచేస్తుంది.

    కొత్త స్విప్ట్ డిజైన్ ఆకర్షణీయంగా ఉండనుంది. ప్రాజెక్టర్ సెటప్ షార్ప్ లుకింగ్ ను కలిగి ఉంటుంది. హెడ్ ల్యాంప్ లు హానీ ఫెస్ట్ మాదిరిగా ఉంటాయి.గ్రిల్ పైన, బానెట్ దిగువన ఉంచింది. ఫ్రంట్ బంపర్ కి కూడా కొన్ని మార్పులు చేశారు. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తాయి. ఎక్సీటీరియర్ లో వీల్స్ తప్ప మిగతా మార్పులు ఏవీ కొత్తగా కనిపించవు. ఇంటీరియర్ విషయానికొస్తే 9.0 అంగుళాల ప్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏసీ వెంట్ లు, కొత్త డ్యాష్ బోర్డు లేఅవుట్ ఉండనుంది.

    లేటేస్ట్ స్విప్ట్ లో సేప్టీ ఫీచర్స్ కూడా అలరిస్తాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ 360 డిగ్రీ కెమెరా, డ్యూయెల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిన్ట్, కొలిజిన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ADAS ఫీచర్లు కూడా ఇందులో చూడొచ్చు. వెంటిలేటేడ్ సీట్లు, ఆటో హోల్డ్ తో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ రక్షణ నిస్తాయి. కొత్త స్విప్ట్ ధర రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో మొదలై రూ.6.3 లక్షల వరకు విక్రయిస్తున్నారు.