https://oktelugu.com/

India Team: 2011 తర్వాత ఇండియా ఓడిపోయిన నాకౌట్ మ్యాచ్ లు ఇవే…

ఇక ఇండియన్ టీం ని కనక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే 2011 వ సంవత్సరంలో వరల్డ్ కప్ వచ్చిందో అప్పటినుంచి ప్రతిసారి నాకౌట్ మ్యాచ్ లోకి వస్తున్నారు ఓడిపోతున్నారు, వెళ్లిపోతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 20, 2023 / 05:15 PM IST
    Follow us on

    India Team: ఇండియన్ టీం వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయి ఒక భారీ పరాభావాన్ని మూటకటుకుంది. ఎప్పుడైతే 2003 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా మీద ఆడిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిందో ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకుంటారని మనం అనుకున్నం కానీ దానికంటే కూడా ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయి మరో పరాభావాన్ని ముటకట్టుకుంది. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం ఇండియా డబ్ల్యూటీసి ఫైనల్లో ఓడిపోగా, ఇక వన్డే ప్రపంచ కల్ ఫైనల్ లో కూడా ఇండియా ఆస్ట్రేలియా మీద ఓడిపోయి ఇండియన్ టీమ్ పరువు తీశారు. ఇక మనవాళ్ళకి నాకౌట్ మ్యాచ్ లు గెలిచే సత్తా లేకుండా పోతుంది అనే ఒక బ్యాడ్ నేమ్ ని ఇండియన్ టీమ్ తన ఖాతాలో వేసుకుంది.

    ఇక ఇండియన్ టీం ని కనక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే 2011 వ సంవత్సరంలో వరల్డ్ కప్ వచ్చిందో అప్పటినుంచి ప్రతిసారి నాకౌట్ మ్యాచ్ లోకి వస్తున్నారు ఓడిపోతున్నారు, వెళ్లిపోతున్నారు. ఇక 2014 టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి వచ్చిన ఇండియన్ టీం శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇక అలాగే 2015 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ దాకా వచ్చి సెమీఫైనల్ లో ఓడిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఇక 2016 వ సంవత్సరంలో టి20 సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. అలాగే 2017 వ సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి వచ్చి ఓడిపోయింది.

    ఇక 2019 సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి వెనుతిరిగింది…ఇక ఈ సంవత్సరం 2023 లో డబ్ల్యూటిసి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక నాలుగు నెలల గ్యాప్ లోనే మళ్లీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కి వచ్చి ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన పరాభావాన్ని చవిచూసింది.ఇక ఈ వరల్డ్ కప్ లో విన్నర్స్ గా మిగులుతారు, అనుకుంటే రన్నర్స్ గా మిగిలారు…

    ఇలా ఇండియన్ టీమ్ వరుసగా మ్యాచ్ లు ఓడిపోతూ ఐసీసీ నిర్వహించే ప్రతి ట్రోఫీని మిస్ అవుతూ వస్తుంది.ఇక ఎప్పుడైతే 2011లో ధోని సారథ్యంలో వరల్డ్ కప్ వచ్చిందో అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ ని కూడా ఇండియన్ టీమ్ కొట్టలేకపోతుందంటే టీమ్ లో పైకి కనిపించని చాలా లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక వాటిని గుర్తించి బీసీసీఐ వాటికి చెక్ పెడితేనే తప్ప లేకపోతే ఇక ఫ్యూచర్ లో ఆడే మ్యాచ్ లకి కూడా ఇండియన్ టీమ్ పరిస్థితి ఇలానే ఉంటుంది…