https://oktelugu.com/

World Cup Trophy: కండకావురం.. ఆస్ట్రేలియాలోళ్లు వరల్డ్‌ కప్‌ను అవమానించేశారు.. ఫ్యాన్స్ ఫైర్!

ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్‌ కప్‌ గెలిచిన విషయం తెలుసు కదా. ఆ కప్పును ఆస్ట్రేలియా క్రికెటర్లకు అందజేసిన తర్వాత ఆ కప్పును తీసుకొని ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ హోటల్‌ కు వెళ్లారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 20, 2023 / 05:20 PM IST
    Follow us on

    World Cup Trophy: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు పెద్దలు తాత్కాలిక విజయానికి పొంగిపోయి.. కష్టాలు వచ్చినప్పుడు బాధపడడం సరికాదు.. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ల తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచాక వాళ్లకు ఆనందం కంటే.. కండకావరం పెరిగింది. ఎంత దారుణం అంటే.. అసలు ఒక ట్రోఫీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా. ప్రపంచ కప్‌ ట్రోఫీ అది. దాని మీద కాళ్లు పెట్టి ఇలా ప్రవర్తించడం అనేది ఎంత వరకు కరెక్ట్‌. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటోను చూసి నెటిజన్లు అయితే తెగ ఫైర్‌ అవుతున్నారు. చీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ల బుద్ధి మారదా ఇక. ఎక్కువ కప్పులు కొట్టామని.. ఎక్కువసార్లు ట్రోఫీ గెలిచామనే ఓవర్‌ కాన్ఫిడెన్సా? లేక బలుపా? ట్రోఫీ విలువ తెలియని వాళ్లను అసలు ప్రపంచ కప్‌ లోనే తీసుకోవద్దు అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఏం జరిగిందంటే..
    ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్‌ కప్‌ గెలిచిన విషయం తెలుసు కదా. ఆ కప్పును ఆస్ట్రేలియా క్రికెటర్లకు అందజేసిన తర్వాత ఆ కప్పును తీసుకొని ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ హోటల్‌ కు వెళ్లారు. అక్కడ సెలబ్రేషన్స్‌ చేసుకుంటూ కప్పును కింద పెట్టారు. ఇలా ట్రోఫీని కింద పెట్టి అవమానించడమే కాకుండా.. ఆ ట్రోఫీపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ మిచెల్‌ మార్ష్‌ కాళ్లు పెట్టాడు. బీరు తాగుతూ దాని మీద కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు మార్ష్ష్‌. ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మీరు అవమానించింది కేవలం ట్రోఫీని మాత్రమే కాదు.. వరల్డ్‌ కప్‌ను, ఐసీసీనే అవమానించారు అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు వరల్డ్‌ కప్‌ గెలిచినా ఆస్ట్రేలియా తీరు మాత్రం మారడం లేదు.

    2006లో కూడా..
    2006 లోనూ ఆస్ట్రేలియా కప్పు గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో వాగ్వాదానికి దిగారు. ట్రోఫీ తీసుకునే సమయంలో అమర్యాదగా ప్రవర్తించారు. క్రికెట్‌ లో తమను కొట్టేవాడు లేడు అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో నాటుకుపోయింది. అందుకే వరల్డ్‌ కప్‌ ట్రోఫీ మీద కనీసం గౌరవం లేకుండా దాని మీద కాళ్లు పెట్టడం, దాన్ని కింద పెట్టి అవమానించడం చేస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.