Richest Player : ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న ఆటగాళ్లు వీరే.. ఇందులో క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడికే స్థానం.. ఇంతకీ అతడి సంపాదన ఎంతంటే..

వెనుకటి రోజుల్లో ఆటగాళ్లకు ఈ స్థాయిలో సంపాదన ఉండేది కాదు. ఆట ద్వారా, కొంతలో కొంత ప్రకటనల ద్వారా వారికి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.. పేరుపొందిన ఆటగాళ్లకు ఆటకంటే.. ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారానే విపరీతమైన ఆదాయం వస్తోంది. అయితే ఈ జాబితాలో ఫుట్ బాల్ క్రీడాకారులదే ఆధిపత్యం. అయితే తొలిసారిగా విరాట్ కోహ్లీ ద్వారా క్రికెట్ ఇందులో స్నానం సంపాదించుకుంది.

Written By: NARESH, Updated On : September 6, 2024 10:07 pm

Richest Player

Follow us on

Richest Player :  గడిచిన ఏడాదిగా ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన పదిమంది క్రీడాకారుల జాబితాను జర్మనీ దేశానికి చెందిన స్టాసిస్టా అనే కంపెనీ వెల్లడించింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్థానం సంపాదించుకున్నాడు. ఏకంగా 47 కోట్ల సంపాదనతో అతడు 9వ స్థానాన్ని ఆక్రమించాడు. 2081 కోట్ల రూపాయల సంపాదనతో పోర్చుగల్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు . స్పానిష్ గోల్ఫ్ క్రీడాకారుడు జాన్ రామ్ 1712 కోట్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచాడు. అర్జెంటీ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సి 1074 కోట్ల సంపాదనతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు లెబ్రోన్ జేమ్స్ 990 కోట్ల సంపాదనతో నాలుగో స్థానాన్ని సాధించాడు. ఫ్రెంచ్ దేశానికి చెందిన ఫుట్ బాల్ ఆటగాడు ఎంబాపే 881 కోట్ల సంపాదనతో ఐదో స్థానంలో నిలిచాడు. గ్రీన్ నైజీరియన్ జట్టుకు చెందిన బాస్కెట్బాల్ ఆటగాడు గియాన్నిస్ 873 కోట్ల సంపాదనతో ఆరో స్థానంలో స్థిరపడ్డాడు. బ్రెజిల్ దేశానికి చెందిన ఫుట్ బాల్ ఆటగాడు నెయ్ మార్ 864 కోట్ల సంపాదనతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు.. ఫ్రెంచ్ దేశాని ఫుట్ బాల్ ఆటగాడు కరీం బెంజెమా 864 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 847 కోట్ల సంపాదనతో 9వ స్థానంలో నిలిచాడు. అమెరికన్ బాస్కెట్బాల్ ఆటగాడు స్టీఫెన్ కర్రీ 831 కోట్ల సంపాదనతో పదోవ స్థానంలో కొనసాగుతున్నాడు..

క్రికెట్ మాత్రమే కాదు..

విరాట్ కోహ్లీకి తగ్గట్టుగా సంపాదనలో క్రికెట్ నుంచి మరే ఆటగాడు లేకపోవడం విశేషం. ఐపీఎల్, టీమ్ ఇండియాకు ఆడుతూ విరాట్ కోహ్లీ కోట్లల్లో వార్షిక వేతనం అందుకుంటున్నాడు. వాణిజ్య ప్రకటనల ద్వారా అంతకంటే రెట్టింపు సంపాదనను కోహ్లీ సంపాదిస్తున్నాడు. ఇటీవల కాలంలో కోహ్లీ వ్యాపారం లోకి ప్రవేశించాడు. కోహ్లీ క్లాతింగ్ స్టోర్, రెస్టారెంట్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదిస్తున్నాడు. దేశంలో పేరుపొందిన మెట్రో నగరాలలో విరాట్ కోహ్లీ రెస్టారెంట్లు ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే అతనికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ రెస్టారెంట్లను భారతదేశ మొత్తం విస్తరించే ఆలోచన అతనికి ఉంది. క్లాతింగ్ స్టోర్ లను కూడా ప్రారంభించేందుకు అతడు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇటీవల పొట్టి ఫార్మాట్ కు విరాట్ వీడ్కోలు పలికాడు. త్వరలోనే మిగతా ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన తర్వాత.. పూర్తిగా వ్యాపారం లోకి ప్రవేశించే అవకాశాన్ని కోహ్లీ పరిశీలిస్తున్నట్లు ఇటీవల జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొంది. ఇక భారతదేశంలో అత్యధికంగా పందు చెల్లిస్తున్న క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఫార్చ్యూన్ ఇండియా జాబితా ప్రకారం విరాట్ కోహ్లీ గడచిన ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో 66 కోట్లు చెల్లించాడు. స్థూలంగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు. షారుక్ ఖాన్ 92 కోట్లు, తమిళ నటుడు విజయ్ 80 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు, అమితాబచ్చన్ 71 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు.