The Goat Movie 2day Collection : తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అదే స్థాయి డామినేషన్ ని చూపిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇళయ తలపతి విజయ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్, సినిమా సినిమాకి తనను తాను మల్చుకుంటున్న విధానం నేడు ఆయనని తమిళనాట నెంబర్ 1 హీరోగా నిలబెట్టింది. విజయ్ మేనియా గడిచిన కొన్నేళ్ల నుండి తమిళనాట ఎలా ఉన్నిందంటే ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యేంత. ఆయన గత చిత్రం ‘లియో’ కి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు విజయ్ మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుంది అనేది. అలాంటి విజయ్ కెరీర్ లో ఇప్పట్లో డిజాస్టర్ ఫ్లాప్ తగులుతుందని ఎవరూ అనుకోలేదు, కానీ రీసెంట్ గా విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. తెలుగు లో ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం రెండు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పుకోవచ్చు. ఇక రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి షేర్ వసూళ్లు రావడమే కరువైంది. లియో చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో ‘గోట్’ చిత్రానికి తెలుగు లో 22 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు బయ్యర్స్ కి కనీసం 19 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒక్క తమిళనాడులో మాత్రమే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కూడా మొదటి రోజు దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి పెద్దగా టాక్ లేకపోవడంతో రెండవ రోజు వసూళ్లు తమిళనాట కూడా బాగా తగ్గిపోయాయి.
విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమా విడుదలకు ముందే చెన్నై వంటి ప్రాంతాలలో మొదటి వీకెండ్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోయాయి. కానీ కౌంటర్ బుకింగ్స్ మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. దీనిని బట్టి సోమవారం నుండి తమిళనాడు లో కూడా ఈ చిత్రానికి వసూళ్లు రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్నికలలో పోటీ చేసేముందు విజయ్ ఇలా డిజాస్టర్ ని మూటగట్టుకోవడం ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశకు గురి చేసిన సంఘటనగా పరిగణించొచ్చు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసే ముందు ‘అజ్ఞాత వాసి’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఇప్పుడు విజయ్ కూడా అలాంటి ఫ్లాప్ ని అందుకోవడం గమనార్హం. చూడాలో మరి రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనేది.