T20 World Cup 2024: ఇండియన్ టీం ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండి వరుస సిరీస్ లను గెలుచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద టి 20 సీరీస్ గెలిచిన ఇండియన్ టీమ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా తో మూడు ఫార్మాట్లల్లో సిరీస్ ఆడబోతుంది… దీనికోసం ముగ్గురు కెప్టెన్ లను కూడా తీసుకున్నారు.ఇక ఇదే క్రమంలో 2024 వ సంవత్సరంలో జరిగే టీ 20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ ఎలాగైనా సరే కప్పు కొట్టి చూపించాలి. లేకపోతే ఇక ఇండియన్ క్రికెట్ అభిమానులు క్రికెట్ చూడటమే మానేస్తారు. ఇక దాని కోసం ఇప్పుడు చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ తన కెప్టెన్సీలో టి20 వరల్డ్ కప్ సాధించి పెడతాడని బిసీసీఐ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక అందుకే అతన్ని కెప్టెన్ గా కొనసాగిస్తూనే టీంలో బుమ్రా, జడేజా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లు ఉంటారు. ఇక వీళ్లతో పాటుగా మరికొంతమంది ప్లేయర్లు కూడా టి20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక వాళ్లలో మొదటగా రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ చేయడానికి ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతున్నారు.
అందులో శుభ్ మన్ గిల్, రుత్ రాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ ఉన్నారు వాళ్లకి పోటీ పడగా వీళ్ళ ముగ్గురిలో ఒకరికి మాత్రమే రోహిత్ తో ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే శుభ్ మన్ గిల్ కి ఓపెనర్ గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ లో మాత్రం యశస్వి జైశ్వల్ గాని, రుతు రాజ్ గైక్వాడ్ గాని అంచనాలకు మించి బాగా ఆడితే వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి రోహిత్ తో ఓపెనింగ్ చేసే అవకాశం కూడా రావచ్చు.ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద ఆడిన మ్యాచ్ లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ చేసి తన సత్తా చాటుకున్నాడు… ఇక నెంబర్ త్రీ పొజిషన్ కోసం ఇషాన్ కిషన్ ని రెడీ చేస్తున్నారు.ఇక వరల్డ్ కప్ నుంచి శ్రేయస్ అయ్యర్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తు ఉండటం తో ఆయన కూడా టీమ్ లో ఉండే అవకాశం అయితే ఉంది.ఇక తనకి బ్యాకప్ గా తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అలాగే ఫినిషర్ గా రింకు సింగ్ ని తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆయన ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అలాగే ఇండియన్ టీమ్ గెలవడంలో కీలకపాత్ర వహించాడు.వికెట్ కీపర్ గా తీసుకోవడానికి కేఎల్ రాహుల్, జితేష్ శర్మ ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఐపిఎల్ లో ఎవరైతే తమ సత్తా చాటుకుంటారో వాళ్ళకి మాత్రమే కీపర్ గా టి20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వస్తుంది ఇక ఇది ఇలా ఉంటే బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కి పోటీగా రవి బిష్ణోయ్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ముందుకు దూసుకు వస్తున్నాడు. ఆర్ష దీప్ సింగ్ కూడా మంచి పర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు తను కూడ టీమ్ లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి…