Pindam Trailer: ఈ మధ్యకాలంలో తెలుగులో సరైన హర్రర్ సినిమా రాలేదని చెప్పాలి. ఇప్పటివరకు అన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలుగానే వస్తున్నాయి. కానీ హార్రర్ ని చూపించే సినిమాలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. అందులో ఇప్పుడు రాబోతున్న పిండం సినిమా ఒకటి…ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా భయపడుతుందనే చెప్పాలి.
అధ్యంతం ఈ ట్రైలర్ భయాన్ని కలిగిస్తూ ఈ సినిమాలో భయానకమైన సంఘటనలు పుష్కలంగా ఉన్నట్టుగా కూడా తెలియజేస్తుంది. ఇక నటుడు శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. హార్రర్ ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక గా ఉంది. ఈ సినిమాతో శ్రీరామ్ మరొక సారి డిఫరెంట్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు గా తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే దయ్యాలు, భూతాలు, ఆత్మ చుట్టూ తిరిగే కథ గా మనకు అర్థం అవుతుంది…
ఇక ఈ కథను దర్శకుడు ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు కానీ ఆయన ఈ సినిమా ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక నిజానికి తెలుగు లో ఈ మధ్య కాలంలో హార్రర్ సినిమాలు రాలేదు. లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన కాంచన సినిమా హార్రర్ తో అందరిని భయపెట్టింది. కానీ ఆ సినిమా తరువాత కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా క్లిక్ అవ్వలేదు…అందుకే ఇప్పుడు ఈ పిండం సినిమా మంచి విజయం సాధిస్తే ఇక మీదట మళ్ళీ హార్రర్ కథలతో సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుంది…
ఇక ఈ ట్రైలర్ ప్రకారం చూస్తే ఒక పాపకి దయ్యం అవాహిస్తే ఎలా ఉంటుంది అనే టైప్ ఆఫ్ కథ తోనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ,భయాన్ని కల్గిస్తు ఈ సినిమా అనేది సాగుతుందనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది.ఇక ఈ సినిమా లో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు…ఇక ఈ సినిమా ఈనెల 15 వ తేదీన రిలీజ్ కి రెఢీ అవుతుంది.ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ కొట్టడానికి పిండం మూవీ టీమ్ రెఢీ అయినట్టు గా తెలుస్తుంది….ఇక ఈ సినిమా సక్సెస్ అయితే నటుడి గా శ్రీరామ్ కి మళ్ళీ తెలుగులో మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది…